ఆకాశానికి చిల్లు పడిందా? అన్న సందేహానికి గురయ్యేలా ఉంది చెన్నై మహానగర పరిస్థితి. తమిళనాడు రాష్ట్ర రాజధాని ఇప్పుడు భారీ వర్షంలో చిక్కుకుపోయింది. మహానగరం మొత్తం తడిచి ముద్దకావటమే కాదు.. లోతట్టు ప్రాంతాల్లో భారీగా వర్షపు నీరు పోటెత్తటంతో ప్రజా రవాణా వ్యవస్థ మాత్రమే కాదు.. లక్షలాది మంది తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. శనివారం రాత్రి నుంచి మొదలైన భారీ వర్షం విడవకుండా కురుస్తోంది. ఇటీవల కాలంలో ఎప్పుడూ చూడని రీతిలో కుండపోత వర్షం కురుస్తోంది. ఈ ఏడాదిలో ఇదే భారీ వర్షంగా వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
గడిచిన కొద్ది గంటల వ్యవధిలో చెన్నై మహానగరంలో దాదాపు 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లుగా తెలుస్తోంది. ఈ భారీ వర్షం కారణంగా చెన్నైలోని వందలాది కాలనీలో వర్షపు నీటితో మునిగాయి. చెన్నై.. చెంగల్ పట్టు.. తిరువళ్లూరులకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. వరదలో చిక్కుకుపోయిన వారిని రక్షించే ప్రయత్నంలో ఉన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ఆదివారం ఉదయం పుఝుల్ రిజర్వాయర్ నుంచి 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు.
.
2015 తర్వాత ఇంత భారీగా వర్షాలు కురవటం ఇదే తొలిసారి అని చెబుతున్నారు. వర్షం కారణంగా దెబ్బ తిన్న ప్రాంతాల్లో ముఖ్యమంత్రి స్టాలిన్ పర్యటించి.. నష్ట తీవ్రతను అంచనా వేస్తున్నారు. ఇప్పటికే అధికారులతో సమీక్ష నిర్వహించి.. సహాయ చర్యల్ని పర్యవేక్షిస్తున్నారు. భారీ వర్షం కారణంగా పలుచోట్ల ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో వాహనదారులు అష్టకష్టాలు పడుతున్నారు.
చెన్నై నగరంలోని చెంబరంపాక్కం చెరువు గేట్లను తెరవాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ కాలువ వెంబడి ఉండే ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని హెచ్చరిక జారీ చేశారు. భారీ వర్షాల కారణంగా రోడ్లు మొత్తం జలమయం కాగా.. వందలాది ఇళ్లల్లోకి వర్షపునీరు చేరినట్లుగా చెబుతున్నారు. వాతావరణ శాఖ అధికారుల అంచనా ప్రకారం నవంబరు 11 వరకు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు.
చెన్నైలోని పెరంబూర్.. అన్నాసలై.. టి. నగర్.. గిండి.. అడయార్.. పెరుంగుడి తదితర ప్రాంతాలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. చెన్నైలోని పలు ప్రాంతాల్లో మోకాలు లోతులో నీరు నిలిచిపోయింది. భారీ వర్షాల కారణంగా లోకల్ ట్రైన్లను నిలిపివేస్తూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. రానున్న 24 గంటల్లో చెన్నతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. దీంతో.. అధికారుల్ని అప్రమత్తం చేస్తూ సీఎం స్టాలిన్ ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తూ.. సహాయక చర్యల్నిస్వయంగా పర్యవేక్షిస్తున్నారు. అధికారులంతా విధులకు హాజరు కావాలని.. ప్రజాప్రతినిధులంతా అందుబాటులో ఉండాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.