500.. 1000 నోట్ల రద్దు నిర్ణయం సామాన్యుడి జీవితంపై చాలా ప్రభావమే చూపిస్తోంది. నిన్నట్నుంచి జనజీవనం అతలాకుతలం అయిపోయిందంటే అతిశయోక్తి కాదు. చేతిలో ఉన్న వంద నోట్లు తక్కువ. 500.. 1000 నోట్లు తీసుకోవడానికి ఎవ్వరూ ముందుకు రావట్లేదు. ఈ పరిస్థితుల్లో దైనందిన అవసరాలు తీరడం చాలా కష్టమైపోయింది. చాలామంది తిండికి ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. ఈ రోజు బ్యాంకులకు వెళ్లి కొత్త నోట్లు తీసుకుందామంటే అక్కడ పెద్ద పెద్ద క్యూలు కనిపిస్తున్నాయి. అయినా జనాలు తగ్గట్లేదు. కొత్త నోట్ల కోసం.. చిల్లర కోసం గంటలు గంటలు పడిగాపులు కాస్తున్నారు.
ఈ నేపథ్యంలో చెన్నైలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్యాలయం దగ్గర చిత్రమైన పరిణామం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి ఒక పెళ్లి కార్డు తీసుకొని కార్యాలయం వద్దకు వచ్చాడు. తన స్నేహితుడి కూతురి పెళ్లి రేపు ఉందని.. ఈ రోజు సాయంత్రం పెళ్లి రిసెప్షన్ జరగబోతోందని.. కాబట్టి తనకు అత్యవసరంగా 4వేల రూపాయలు కంటే ఎక్కువ డబ్బు అవసరముందని అతను కోరాడు. నమ్మకం కలిగించడానికి శుభలేఖను కూడా వెంట తెచ్చాడు. అది అందరికీ చూపిస్తూ.. తనకు ఎక్కువ డబ్బు ఇవ్వాలని అధికారులను వేడుకున్నాడు. కానీ అతను అతను ఎంత బతిమాలుకున్నా బ్యాంకు అధికారులు నాలుగు వేల కన్నా ఎక్కువ ఇవ్వడానికి అవకాశమివ్వలేదు. దీంతో అతను మీడియాకు తన మీడియాకు తన గోడు వెళ్లబోసుకున్నాడు. అయినా ఫలితం లేకపోయింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/