తమిళనాడులోని పలు ప్రాంతాల్లో ఏకధాటిగా వర్షం కురుస్తోంది. ఈశాన్య రుతుపవనాలు ప్రారంభంలోనే వర్షాలు నగర శివారు ప్రాంతాలను జలదిగ్బంధం చేశాయి. నగరంలోని పలుచోట్ల జనజీవనాన్ని అస్తవ్యస్తంగా మార్చాయి. కోవిలంబాక్కమ్ ఏరియా - కొరట్టూరు - చెన్నై ప్రాంతాల్లో ఎక్కడికక్కడ వర్షపు నీరు నిలిచిపోయింది. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షంతో రోడ్లపైకి నీరు చేరింది. కాలనీల్లోకి నీరు చేరి చెరువులను తలపిస్తున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో వాహన రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. వానల ప్రభావం మరో రెండు రోజులు కొనసాగనుంది. కోస్తా జిల్లాల్లో భారీవర్షాలు కురవనున్నాయని, కొన్నిచోట్ల 15 సెం.మీ. నుంచి 30 సెం.మీ. మేరకు వర్షపాతం నమోదు కానుందని వాతావరణ పరిశోధన కేంద్రం హెచ్చరించింది.
తమిళనాడు రాష్ట్రంలో సెప్టెంబరు 27న ఈశాన్య రుతుపవనాలు ప్రారంభమైన నేపథ్యంలో బంగాళాఖాతం నైరుతి భాగంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా చెన్నై తదితర 10 కోస్తా జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై - కాంచీపురం - తిరువళ్లూరు జిల్లాల్లోని పలు చోట్ల వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంది. ఈ మూడు జిల్లాల్లో ఆదివారం నుంచి బుధవారం వరకు 20 సెంటిమీటర్ల మేరకు వర్షపాతం నమోదయింది. ఈ నేపథ్యంలో చెన్నై తదితర కోస్తా జిల్లాల్లో మరో రెండు రోజులకు భారీవర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ పరిశోధన కేంద్రం వర్గాలు తెలిపాయి. కొన్ని చోట్ల ఈ వర్షాలు 15 నుంచి 30 సెంటిమీటర్ల మేరకు పడొచ్చని, రెండు రోజుల్లో కురిసే వర్షాలు 40 సెంటిమీటర్ల మేరకు ఉండొచ్చని భావిస్తున్నాయి.
20 సెంటిమీటర్ల వర్ష పాతానికే నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. శివారు ప్రాంతాలు జలదిగ్బందంలో చిక్కుకున్నాయి. మరో రెండు రోజులు భారీవర్షాలు పడితే పరిస్థితి మరింత జఠిలంగా ఉండొచ్చని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2015 నాటి పరిస్థితి పునరావృతం అవుతుందేమోనని భయపడుతున్నారు. వీటిని గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ అధికారులు కొట్టిపారేస్తున్నారు. ఇప్పటికే పలు ముందస్తు జాగ్రత్త చర్యలను కార్పొరేషన్ యంత్రాంగం చేపట్టిందని, నగరంలో వర్షపునీరు నిలవకుండా యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతున్నామని తెలిపారు. శనివారం తర్వాత వర్షప్రభావం తగ్గనుందని చెబుతున్నాయి.
ఈ వరద బీభత్సంతో...తమిళనాడులోని మూడు యూనివర్శిటీలు - పాఠశాలల్లో ఈ వారం - వచ్చే - వారం నిర్వహించాల్సిన పరీక్ష్లలు వాయిదా వేస్తున్నామని తమిళనాడు విద్యా శాఖ అధికారులు శుక్రవారం ప్రకటించారు. మరోవైపు వరద నివారణ చర్యల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని డీఎంకే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే. స్టాలిన్ - తమిళమానిల కాంగ్రెస్ నేత జీకే. వాసన్ - సీపీఐ నేత ముత్తరసన్ మండిపడ్డారు. చెన్నైకి మళ్లీ వరద ముప్పు తప్పదని బహుబాష నటుడు కమల్ హాసన్ హెచ్చరించారు. దక్షిణ చెన్నైలోని చెరువులు అన్నీ నిండిపోయాయని, పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారు జాగ్రత్తగా ఉండాలని కమల్ హాసన్ సూచించారు.