కోల్‌కతా పని క్లోజ్.. చివరి బంతికి చెన్నై థ్రిల్లింగ్ విక్టరీ

Update: 2020-10-30 04:15 GMT
ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌  చేతులెత్తేసింది. విజయం కోసం కడదాకా పోరాడిన చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో అపజయం పాలయ్యింది. రెండు ఓవర్లో 30 పరుగులు చేయాల్సిన తరుణంలో చెన్నై బ్యాట్స్ మెన్ జడేజా వద్ద అద్భుతమే  చేసాడు. 19వ ఓవర్లో ఏకంగా 20 పరుగులు చేసిన జడేజా చివరి రెండు బంతులకు  సిక్సర్లు బాది చెన్నై కి అనూహ్య విజయాన్ని అందించాడు.  చెన్నై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్ కతా  ఓపెనర్‌ నితీశ్‌ రాణా (87: 61 బంతుల్లో 10ఫోర్లు, 4సిక్సర్లు) అద్భుత అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు.

మరో ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్ ‌(26: 17 బంతుల్లో 4ఫోర్లు), చివరలో దినేశ్‌ కార్తీక్‌ (21 నాటౌట్:‌ 10 బంతుల్లో 3ఫోర్లు)  రాణించారు. కెప్టెన్ ఇయాన్‌ మోర్గాన్‌ (15)విఫలం అయ్యాడు. రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 172 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లలో లుంగి ఎంగిడి రెండు వికెట్లు తీయగా.. సాంట్నర్‌, జడేజా, కర్ణ్‌ శర్మ చెరో వికెట్‌ పడగొట్టారు.

 అనంతరం ఛేదనలో చెన్నై ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్ ‌(72: 53 బంతుల్లో 6ఫోర్లు, 2సిక్సర్లు) అద్భుత అర్ధ సెంచరీతో మెరవగా అంబటి రాయుడు (38: 20బంతుల్లో 5ఫోర్లు, సిక్స్‌) ఆదుకున్నాడు. వాట్సన్‌ (14; 19బంతుల్లో ఫోర్‌, సిక్సర్‌) ధోనీ (1) విఫలం అయ్యారు.

ఓటమి కోరల్లోకి వెళ్లిన జట్టుని జడేజా (31 నాటౌట్:‌ 11 బంతుల్లో 2ఫోర్లు, 3సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ తో గాడిలోకి తెచ్చి అద్భుత థ్రిల్లింగ్ విక్టరీ అందించాడు. ఈ మ్యాచ్‌ ఓటమితో కోల్‌కతా ప్లేఆఫ్స్‌ అవకాశాలు దాదాపు మూసుకుపోయాయి.

జడ్డూ  భారీ సిక్సర్ల మోత

చెన్నై విజయానికి 15 బంతుల్లో 33 పరుగులు అవసరమైన సమయంలో గైక్వాడ్‌ కూడా ఔటవగా  చివరి రెండు ఓవర్లలోనే మ్యాచ్‌ చెన్నై వైపు తిరిగింది. ఫెర్గుసన్‌ వేసిన 19వ ఓవర్లో జడేజా ఫోర్‌, రెండు సిక్సర్లు బాది 20పరుగులు రాబట్టాడు. ఆఖరి ఓవర్‌లో 10 పరుగులు అవసరం కాగా చివరి రెండు బంతులను జడేజా రెండు భారీ సిక్సర్లుగా మలిచి చెన్నైకి అద్భుతవిజయాన్నందించాడు.  

కోల్ కతా ఆశలు గల్లంతు
 
చెన్నై పై విజయం సాధించి ప్లే ఆఫ్స్ లోకి దూసుకెళ్లాలని భావించే కోల్ కతాకు కు నిరాశే మిగిలిపోయింది. చివరి వరకూ విజయం కోల్ కతా  వైపు ఉన్నా చివరి రెండు ఓవర్లలో అద్భుత బ్యాటింగ్ తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు. చెన్నై కి అద్భుత విజయాన్ని అందించాడు. అనూహ్య పరాజయంతో నైట్ రైడర్స్ పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి  చేరింది. దీంతో దాదాపు రైడర్స్ కి ప్లే ఆఫ్స్ దారులు మూసుకు పోయినట్లే.
Tags:    

Similar News