సుప్రీం తీర్పు పేరుతో బ‌రితెగించిన 'చెన్నై' భ‌ర్త‌!

Update: 2018-10-02 05:08 GMT
గ‌డిచిన వారంలో వ‌రుస పెట్టి రెండు కీల‌క తీర్పులు వెల్ల‌డించిన సుప్రీంకోర్టు పుణ్య‌మా అని.. దేశ వ్యాప్తంగా భారీ చ‌ర్చ‌కు తెర తీసింది. గ‌తంలో ఎప్పుడూ లేని విధంగా ఈ రెండు తీర్పుల‌పై దేశ వ్యాప్తంగా ప్ర‌జ‌లు చ‌ర్చించుకుంటున్నారు. ఇటీవ‌ల కాలంలో సుప్రీం వెలువ‌రించిన తీర్పుల‌పై ఇంత భారీగా.. సాధార‌ణ ప్ర‌జానీకం సైతం చ‌ర్చ‌లు జ‌ర‌ప‌టం.. భిన్నాభిప్రాయాన్ని వ్య‌క్తం చేయ‌టం గ‌మ‌నార్హం.

ఇదిలా ఉంటే.. సుప్రీం చెప్పిన‌ట్లుగా వివాహేత‌ర సంబంధం నేరం కాద‌న్న మాట‌ను చెన్నైకి చెందిన ఒక భ‌ర్త బ‌రితెగింపు ఒక అమాయ‌కురాలి ప్రాణం మీద‌కు తీసుకొచ్చింది. అదే స‌మ‌యంలో.. శ‌బ‌రిమ‌ల‌కు మ‌హిళ‌ల్ని అనుమ‌తించిన వైనం కూడా ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి దారి తీసింది.

శ‌బ‌రిమ‌ల‌కు10 నుంచి 50 ఏళ్ల మ‌ధ్య‌నున్న మ‌హిళ‌ల్ని అనుమ‌తించొచ్చ‌న్న తీర్పుపై విర‌క్తి చెందిన ఒక వ్య‌క్తి సూసైడ్ అటెంప్ట్ చేయ‌టం క‌ల‌క‌లంగా మారింది. ఇదొక అంశ‌మైతే..బాధ్య‌త లేకుండా ఒక భ‌ర్త బ‌రితెగింపు.. వివాహేత‌ర సంబంధం విష‌యంలో సుప్రీం తీర్పును ప్ర‌స్తావించి.. సుప్రీంకోర్టే త‌ప్పు కాదంది.. ఏం చేసుకుంటావో చేసుకో అన్న మాట‌ల‌తో వేద‌న చెందిన ఒక మ‌హిళ ఆత్మ‌హ‌త్య చేసుకున్న వైనం దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారింది. ఈ అంశం సోష‌ల్ మీడియాలో భారీ ఎత్తున వైర‌ల్ అయ్యింది.

చెన్నై కార్పొరేష‌న్ పార్కులో వాచ్ మ‌న్ గా ప‌ని చేసే 26 ఏళ్ల జాన్ పాల్ రెండేళ్ల క్రితం పుష్ప‌ల‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వారికి ఏడాది వ‌య‌సున్న కుమార్తె కూడా ఉంది. ఇదిలా ఉంటే.. పుష్ప‌ల‌త ఆరోగ్యం స‌రిగా లేక‌పోవ‌టం.. ఆమె క్ష‌య ఉంద‌న్న కార‌ణంగా ఆమెను నెమ్మ‌దిగా దూరం పెట్ట‌టం మొద‌లెట్టాడు.

తాజాగా జాన్ పాల్ కు మ‌రో మ‌హిళ‌తో వివాహేత‌ర సంబంధం ఉంద‌న్న విష‌యాన్ని పుష్ప‌ల‌త తెలుసుకొంది. దీనిపై ఆగ్ర‌హం చెందిన ఆమె జాన్ పాల్ ను నిల‌దీసింది. దీనికి అత‌గాడు.. సుప్రీంకోర్టు తాజా తీర్పును చెప్పి.. వివాహేత‌ర సంబంధం త‌ప్పు కాద‌ని సుప్రీంకోర్టు చెప్పింద‌ని.. పోలీసులే ఏం చేయ‌ర‌ని.. చ‌ట్టం కూడా త‌న‌నేం చేయ‌లేద‌ని చెప్పారు. దీంతో.. త‌న ఆవేద‌నంతా సూసైడ్ నోట్ లో రాసి ఆత్మ‌హ‌త్య చేసుకుంది పుష్ప‌ల‌త‌.

ఈ ఘ‌ట‌న గురించి స‌మాచారం అందుకున్న పోలీసులు జాన్ ను అదుపులోకి తీసుకోగా.. వారి ముందు సుప్రీంతీర్పును ప్ర‌స్తావించి ఎదిరించిన వైనం ఇప్పుడు కొత్త చ‌ర్చ‌కు తెర తీసింది. ఈ ఉదంతాన్ని ప్ర‌స్తావిస్తూ.. ప‌లువురు సుప్రీం తీర్పు ఎలాంటి విప‌రిణామాల‌కు తావిస్తుందో చూశారా? అని ప్ర‌శ్నిస్తున్నారు. మ‌రి.. సుప్రీంజ‌డ్జిలు ఈ ఉదంతం గురించి ఏమంటారో?
Tags:    

Similar News