ప్లాస్టిక్ సర్జరీ ఆపరేషన్..నటి మృతి కేసులో కీలక ట్విస్ట్

Update: 2022-05-20 08:30 GMT
సినిమా నటి అనగానే గ్లామర్ ప్రపంచం.. లగ్జరీ లైఫ్ అనుకుంటాం.. కానీ ఆ లగ్జరీ వెనుక అనేక సర్జరీలు ఉంటాయన్న సంగతి అస్సలు మరిచిపకూడదు. వాళ్ల గ్లామర్ వెనుక, ప్రాణాంతకమైన ముగింపు కూడా ఉంటుంది. ఇటీవల ఓ నటిని అది వెంటాడింది.పెద్ద హీరోయిన్ కావాలని కలలు కన్న కన్నడ యువ నటి చేతనరాజ్ కలలు కల్లలయ్యాయి.

అవకాశాల కోసం ఎన్నో ప్రయత్నాలు చేసిన చేతన రాజ్ కు నిరాశే మిగిలింది. అందం రెట్టింపు చేసుకుంటే కెరీర్ సెట్ అవుతుందని ఆశపడింది.చివరకు ప్రాణాలనే కోల్పోయింది. చేతన రాజ్ ఫ్యాట్ ఫ్రీ సర్జరీ కోసం బెంగళూరులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ ను సంప్రదించింది.

ఈనెల 16న సర్జరీ కోసం ఆమె ఆస్పత్రిలో చేరింది. సర్జరీ అయ్యాక సడెన్ గా ఆమె ఆరోగ్యం క్షీణించింది. ఆమె ఊపిరితిత్తుల్లోకి ఎక్కువగా నీరు చేరిపోయింది. ఒక్కసారిగా ఆరోగ్య పరిస్థితి విషమించింది. వైద్యులు తమ వంతు ప్రయత్నాలు చేసినా.. ఆమె ప్రాణాలు మాత్రం కాపాడలేకపోయారు. వైద్యుల నిర్లక్ష్యమే తమ కుమార్తె ఆకాల మరణానికి కారణమని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

చేతన రాజ్ ఫ్యాట్ ఫ్రీ ప్లాస్టిక్ సర్జరీ లేదా ‘లైపోసక్షన్’ ఆపరేషన్ చేయించుకుంది. శరీర ఆకృతి సరిగా రావడానికి.. అందాన్ని మెరుగుపరుచుకోవడానికి ఈ ఆపరేషన్ చేయించుకుంటారు. శరీరంలో తొడలు, తుంటి, పిరుదులు, ఉదరం, చేతులు, మెడ లేదా వీపు వంటి పలు భాగాల్లోని కొవ్వును తొలగించేందుకు లైపోసక్షన్, ఫ్యాట్ ఫ్రీ ప్లాస్టిక్ సర్జరీలను చేస్తుంటారు.

లైపోసక్షన్ ఆపరేషన్ లలో రక్తం గడ్డకట్టడం.. రక్తస్రావం, వివిధ శరీర భాగాలలో ద్రవం చేరడం వంటి ప్రమాదాలు అధికంగా ఉంటాయి. ఇదే చేతన్ రాజ్ కు విషమించి ఆమె మరణానికి కారణమైంది. లైపోసక్షన్ అనేది శరీర ఆకృతి, అందాన్ని పెంపొందించడం కోసం చేసే సౌందర్య శస్త్రచికిత్స. ఇలాంటి ఆపరేషన్లు ఒకే సిట్టింగ్ లో పూర్తి చేయాలి. లేదంటే ప్రాణాలకే ప్రమాదం.

ఇలాంటి సర్జరీలు కేవలం చేతన రాజ్ మాత్రమే కాదు.. హీరోయిన్స్ కూడా ఎక్కువగా చేయించుకుంటున్నారు. కానీ వాళ్లు విదేశాలకు వెళ్లి మంచి ఆస్పత్రుల్లో వీటిని చేసుకుంటున్నారు. రిస్క్ అని తెలిసినా శరీరాకృతి కోసం ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. హీరోయిన్ల అందమే వారిని ఈ దుస్థితికి దిగజార్చేలా చేస్తోంది. వారి ప్రాణాలు తీస్తోంది.
Tags:    

Similar News