ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు విమర్శల్లో చిక్కుకున్నారు. ఏపీ రాజధాని నిర్మాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించాలని తహతహలాడుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పూజల మీద పూజలు చేయటం తెలిసిందే. రాజధాని శంకుస్థాపన కోసం ఏపీలోని ప్రతి గ్రామం నుంచి మట్టి.. నీటిని సేకరించి.. రాజధాని నిర్మాణంలో వినియోగించాలని భావిస్తున్నారు.
ఇందులో భాగంగా ఈ కార్యక్రమాన్ని తన సొంతూరు నారావారి పల్లె నుంచి బాబు షురూ చేశారు. పుట్టమట్టితో పాటు.. నీటిని సేకరించి.. పూజలు జరిపి.. ఊరేగింపు చేయించి రాజధానికి తరలించనున్నారు. మంగళవారం మొదలైన ఈ కార్యక్రమం రానున్న రెండు రోజుల్లో ఏపీ మొత్తం జరగనుంది. ఇదిలా ఉంటే.. విపక్ష నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొత్త వాదనను తెరపైకి తీసుకొచ్చారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు పెద్దనాన్న కొడుకు ఇటీవల మరణించారని.. ఈ కారణంతోనే ఈ నెల 15న నిర్వహించాల్సిన తన మనవడి పుట్టు వెంట్రుకుల కార్యక్రమం రద్దు చేసుకున్నారని.. కర్మ క్రియలు పూర్తయ్యే వరకూ ఎలాంటి శుభకార్యాలు చేయరన్నారు. కానీ.. నవ్యాంధ్ర రాజధాని శంకుస్థాపన కార్యక్రమం కోసం నాగపూజల్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎలా నిర్వహిస్తారని ఆయన ప్రశ్నించారు.
ఇంట్లో శుభకార్యాలే చేయకూడదని క్యాన్సిల్ చేసుకున్నప్పుడు.. రాజధానికి సంబంధించిన శుభ కార్యాల్ని చేయాలనుకోవటం.. మత విశ్వాసాల్ని దెబ్బ తీయటమేనని వ్యాఖ్యనించారు. ఈ విషయంపై మత గురువులు రియాక్ట్ కావాలని డిమాండ్ చేస్తున్నారు. మత విశ్వాసాల్ని పట్టించుకోకుండా.. బాబు పూజలు చేయటాన్ని తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. మరి.. ఈ ఆరోపణకు ఏపీ ముఖ్యమంత్రి ఏం సమాధానం ఇస్తారో..?