గెలవాలి! ఎలాగైనా గెలవాలి! ఎంత నీచానికైనా తెగబడి గెలవాలి! గెలుపు కోసం ఏమైనా చేసేయాలి! ఇదీ ఇప్పుడు అధికార పార్టీ టీడీపీ నైజంగా మారిందని అంటున్నారు విపక్షం వైసీపీ నేతలు. అనడమే కాదు.. ఈ నీచానికి సంబంధించిన రుజువులను సైతం వారు బయటపెడుతున్నారు. విషయంలోకి వెళ్తే.. నంద్యాల ఉప పోరు ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టీ.. కాకినాడపై పడింది. దాదాపు ఏడేళ్ల తర్వాత ఇక్కడ మునిసిపాలిటీ ఎన్నికలు జరుగుతుండడంతో దీనిని అధికార - విపక్ష పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.
అయితే, ఎన్నికలన్నాక.. నిజాయితీగా ప్రచారం చేసుకుని, తమ తమ పంథాల్లో ఓటర్లను ఆకట్టుకునే పద్ధతికి అధికార పార్టీ తిలోదకాలిచ్చిందని వైసీపీ నేత - ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి విమర్శిస్తున్నారు. అడుగడుగునా అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ.. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అడ్డమైన గడ్డీ తింటున్నారని టీడీపీ నేతలపై విరుచుకుపడ్డారు. నిజాయితీ నా ప్రాణం అని చెప్పుకొని తిరిగే.. చంద్రబాబు ఇలా అడ్డదారిలో దొడ్డిదారిలో నడవడం ఎంత మేరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. కార్పొరేషన్‌లో విజయం కోసం తమ పార్టీ టీడీపీకి ఓటు వేయించాలని అధికారుల పై ఒత్తిడి తేస్తున్నారని విమర్శించారు.
అంగన్ వాడీలు - మెప్మా వర్కర్లపై కూడా ప్రభుత్వ ఒత్తిడి ఎక్కువైందని చెవిరెడ్డి ధ్వజమెత్తారు. యువకులను తమ వైపు తిప్పుకునేందుకు వారిని మద్యానికి బానిసలు చేస్తున్నారన్నారు. ఓటుకు రూ. 2 వేల చొప్పున పంపిణీ చేస్తున్నారని పేర్కొన్నారు. డ్వాక్రా మహిళలను పట్టించుకోని ప్రభుత్వం, వారికి రుణమాఫీ చేయని ప్రభుత్వం.. ఎన్నికల కోసం వారి అకౌంట్లలో డబ్బులు జమ చేస్తున్నారని చెప్పారు. ఈ విషయంపై ఎన్నికల సంఘం స్పందించాలని కోరారు. ఎన్నికల సంఘం మహిళల అకౌంట్లను తనిఖీ చేయాలని కూడా డిమాండ్ చేశారు. దీంతో ఇప్పుడు టీడీపీపై సర్వత్రా ఏవగింపు కనిపిస్తుండడం గమనార్హం.