వైసీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య నలుగుతోన్న రాజకీయం ఆసక్తిగా మారింది. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరెడ్డి కన్ను ఇప్పుడు తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్ మీద కూడా పడిందన్న టాక్ తిరుపతిలో జోరుగా వినిపిస్తోంది. వైసీపీ ఫైర్‌బ్రాండ్ నేతల్లో ఒకరిగా చెవిరెడ్డి గుర్తింపు పొందారు. గత ఎన్నికల్లో గెలిచిన ఆయన ఈ ఎన్నికల్లో గెలుపుతో వరుసగా రెండోసారి విజయం సాధించారు. వాస్తవంగా చూస్తే కరుణాకర్‌రెడ్డే సీనియర్. 2012 ఉప ఎన్నికల్లోనే ఆయన వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.
2014 ఎన్నికల్లో కరుణాకర్‌రెడ్డి ఓడిపోవడం, చెవిరెడ్డి ఎమ్మెల్యేగా గెలవడంతో జగన్ దగ్గర చెవిరెడ్డి ప్రయార్టీ పెరిగింది. ఇక తాజా ఎన్నికల్లో చెవిరెడ్డి భారీ మెజార్టీతో వరుసగా రెండోసారి గెలవగా.. కరుణాకర్‌రెడ్డి స్వల్ప మెజార్టీతో గట్టెక్కారు. చెవిరెడ్డి జగన్ కేబినెట్‌లో మంత్రి పదవి కూడా ఆశించారు. అయితే జగన్ ఆయనకు తుడా చైర్మన్ పదవితో పాటు టీటీడీలో ఎక్స్ అఫిషియో మెంబర్‌గా కూడా ఉన్నారు. ఇప్పుడు చెవిరెడ్డి పేరుతో తిరుపతిలో ఎక్కువ హంగామా నడుస్తోంది.
చెవిరెడ్డి తనయుడు పేరిట కూడా తిరుపతి సిటీ నిండా ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారు. తిరుపతిలో కూడా చెవిరెడ్డి వర్గం దూకుడుగా వెళుతుండడంతో కరుణాకర్‌రెడ్డి వర్గంలో కాస్త కలవరం మొదలైనట్టే తెలుస్తోంది. తుడా చైర్మన్ కావడంతో కూడా తిరుపతిలో చెవిరెడ్డికి అడ్డు చెప్పేందుకు అస్కారం లేదు. దీనిపై పైకి చెప్పకపోయినా లోలోపల మాత్రం కరుణాకర్‌రెడ్డి కాస్త టెన్షన్‌తోనే ఉన్నట్టు ఆయన అనుచరుల ద్వారా బయటకు వినిపిస్తోన్న మాట.
సహజంగానే కరుణాకర్‌రెడ్డి లాంటి నేత తన నియోజకవర్గంలో మరో నేత హడావిడి జీర్ణించుకోలేరు. తిరుపతి ఆయనకు కంచుకోట. అలాంటి చోట ఇప్పుడు మూడు పదవులు ఉన్న చెవిరెడ్డి దూసుకుపోతుండడంతో గుంబనంగా ఉంటున్నారు. ఈ విషయంపై కరుణాకర్‌రెడ్డి నోరు మెదపకపోయినా ఆయన అనుచరులు మాత్రం తీవ్ర అసంతృప్తితోనే ఉన్నారు. మా అన్న నియోజకవర్గంలో వేరే వాళ్ల హంగామా ఏంటన్నదే వారి ఆవేదన. మరి ఇది భవిష్యత్తులో మలుపులు తిరుగుతుందా ? సద్దుమణుగుతుందా ? అన్నది చూడాలి.