వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ కు వీర విధేయుడైన నేతల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒకరు. చిత్తూరు జిల్లాకు చెందిన ఈ నేతకు జగన్ మాట వేదవాక్కు. ఆయన నోటి నుంచి ఏదైనా మాట రావాలే కానీ దాని అంతు చూసుకొస్తాడు. దీనికి తోడు ఆయనకు సహజంగానే చూసి రమ్మంటే కాల్చి వచ్చేసేరకం కావటంతో ఆయన్ని అదుపు చేయటం ఒక పట్టానా సాధ్యమయ్యేది కాదు. మొదటిసారి ఎమ్మెల్యే అయిన ఆయన్ను అసెంబ్లీ సమావేశాల్లో ఆపటం ఎంత కష్టమో.. ఏపీ అధికారపక్షానికి బాగానే తెలుసు.
తన దూకుడు.. దుందుడుకుతనంతో ఎంతకైనా రెఢీ అన్నట్లుగా వ్యవహరించే ఆయన.. తాజాగా చేసిన ఒక వ్యాఖ్య కలకలం రేపుతోంది. అధికారంలో ఎవరుంటే వారికి కాస్త అనుకూలంగా వ్యవహరించటం అధికారులకు మామూలే. దీనిపై విపక్షంలో ఉన్న నేతలు ఇబ్బంది పడుతుంటారు. పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబుకు సైతం ఇలాంటి చేదు అనుభవాలు చాలానే అయ్యాయి. చివరకు తిరుమల కొండకు వచ్చినప్పుడు కూడా ఆయనకు తిప్పలు తప్పలేవు.
అలాంటి అనుభవాలు ఎదురైన ప్రతిసారి మండిపడటం బాబుకే కాదు.. చాలామంది విపక్ష నేతలకు అనుభవమే. మరి.. ఇలాంటి ఇబ్బంది ఎక్కడ ఎదుర్కొన్నారో కానీ.. చెవిరెడ్డి చాలా సీరియస్ అయిపోతున్నారు. అధికారపక్షానికి అండగా ఉండి న్యాయాన్ని తుంగలో తొక్కేస్తే భవిష్యత్తులో తిప్పలు తప్పవంటూ ఓపెన్ గానే వార్నింగ్ ఇచ్చేస్తున్నారు.
తాజాగా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో విలేకరులతో మాట్లాడిన ఆయన.. అధికారులు పద్ధతి తప్పితే.. ఇప్పుడు బాగానే ఉన్నా.. భవిష్యత్తులో మాత్రం తిప్పలు తప్పవని చెబుతున్నారు. ప్రజా వ్యతిరేక విధానాల్ని అనుసరిస్తున్న తెలుగుదేశం సర్కారు పతనం దగ్గర్లోనే ఉందని.. ఆ తర్వాత అధికారం తమదేనని.. అప్పుడు మాత్రం న్యాయం తప్పిన అధికారులకు తిప్పలు తప్పవని చెబుతున్నారు. చెవిరెడ్డి వ్యవహారం చూస్తుంటే.. చిత్రగుప్తుడి చిట్టా మాదిరి.. అధికారపక్షానికి అనుకూలంగా ఉన్న అధికారుల జాబితాను ఒకటి తయారు చేసేటట్లు ఉందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.