తాను మాట్లాడే ప్రతి మాట ఆచితూచి మాట్లాడతానని.. గుండెల్లో నుంచి నాలుక చివరి వరకూ వచ్చేసరికి ఎంతో మథనం చేశాక మాత్రమే మాట్లాడతానని గొప్పలు చెప్పే జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాటల్లో పస ఎంతన్నది గడిచిర రెండు.. మూడు రోజులుగా చూస్తున్నదే. దారుణమైన అత్యాచారాలకు పాల్పడే నిందితులకు ఉరిశిక్ష ఏమిటి? చర్మం ఊడేలా రెండు పేను బెత్తంతో దెబ్బలు కొట్టాలంటూ సరికొత్త సిద్ధాంతీకరణ చేసి అందరి చేత తిట్టు తింటున్నారు.
దిశ ఉదంతంతో దేశ ప్రజలంతా రగిలిపోతున్న వేళ.. అందుకు భిన్నంగా పవన్ వ్యాఖ్యలు ఉండటాన్ని తీవ్రంగా తప్పు పడుతున్నారు. తన చిన్నతనంలో తన సోదరిని ఏడిపించిన వారిని తుక్కు రేగ కొట్టాలని ఉండేదన్న తన పాత మాటల్ని పవన్ గుర్తుకు తెచ్చుకుంటే మంచిందంటున్నారు. తన సోదరిని కామెంట్ చేసినోడిపైనే అంత కోపం వచ్చినప్పుడు.. దారుణంగా అత్యాచారం చేసి చంపేసిన దుర్మార్గులకు బెత్తంతో రెండు దెబ్బలు వేస్తే సరిపోతుందన్న మాటలో అర్థం లేదంటున్నారు.
ఇదిలా ఉంటే.. పవన్ వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అదే పనిగా లెక్చర్లు దంచకుండా సింఫుల్ గా రెండు మాటల్లో పవన్ లెక్క తేల్చేయటం ఆసక్తికరమని చెప్పాలి.
పవన్ వ్యాఖ్యలపై స్పందించాలన్న మీడియా ప్రతినిధుల మాటలకు రియాక్ట్ అయిన ఆయన.. తాను రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానని.. పవన్ కల్యాన్ రెండు చోట్ల ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారని.. రెండుసార్లు గెలిచిన తాను.. రెండుసార్లు ఓడినవాని గురించి మాట్లాడటం ఏమిటి? ఏం మాట్లాడాలి? సారీ.. అంటూ తేల్చేశారు. పవన్ పై చెవిరెడ్డి వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.