ఛత్రపతి శివాజీ మహరాజు వారసుడిగా చెప్పే ఛత్రపతి శివాజీ రాజే భోసలే (75) మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. కాస్త ఆలస్యంగా ఈ ఉదంతం బయటకు వచ్చింది.
శివాజీ మహరాజు 12వ తరం వారసుడైన ఆయన వయో సంబంధిత సమస్యల కారణంగా మరణించినట్లుగా చెబుతున్నారు.
శివాజీ రాజ్ మరణంపై ఆయన మేనల్లుడు.. బీజపీ రాజ్యసభ ఎంపీ ఉదయ్ రాజ్ భోసలే తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఫూణెలోని సతారాకు గతంలో మేయర్ గా వ్యవహరించారు. ఆయన పార్థివ దేహాన్ని సతారాలోని అధాలత్ వాడాలో కడసారి చూసేందుకు వీలుగా ఉంచారు.
ఛత్రపతి శివాజీ రాజే భోసలే మరణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంతాపాన్ని వ్యక్తం చేశారు. సమాజం కోసం ఆయన చేసిన కృషిని కొనియాడారు.
ఆయన మరణంతో కళలు.. క్రీడలు.. సాహిత్యం.. సంస్కృతికి సంబంధించిన రంగాల్లో సేవలు అందించిన ఒక మంచి వ్యక్తిని కోల్పోయినట్లుగా చెబుతున్నారు. ఆయన మరణానికి పలువురు నేతలు తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. శివాజీ మహరాజ 12వ తరం వారసుడిగా భోసలే సుపరిచితులు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.