పెద్ద సాహసమే చేశారు ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్. ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రి చేయని పనిని ఆయన చేశారు. దీపావళి సందర్భంగా ఏర్పాటు చేసే ఉత్సవాలకు హాజరైన ఆయన.. అనూహ్యంగా తీసుకున్న నిర్ణయం అక్కడి వారంతా ముక్కున వేలేసుకునేలా చేసింది. దీపావళి సందర్భంగా వరిగడ్డితో చేసిన కొరడాతో చేతి మీద కొట్టించుకున్న వివరాల్ని ఆయనే స్వయంగా వెల్లడించటం విశేషం.
దీపావళి సందర్భంగా గోవర్ధన పూజను నిర్వహిస్తారు. ఈ పూజలో భాగంగా కొరడా దెబ్బలు తింటే మంచిదని అక్కడి వారి నమ్మకం. ఇలా కొరడా దెబ్బలు తింటే మంచి జరుగుతుందనని.. సకల శుభాలు జరుగుతాయన్న నమ్మకం ఉంది. దీంతో.. ముఖ్యమంత్రి ప్రజల శ్రేయస్సు కోసం తాను కొరడా దెబ్బలు తినేందుకు సిద్ధమని చెప్పారు.
ఇందులో భాగంగా గడ్డితో తయారు చేసిన కొరడాతో దెబ్బలు కొట్టించుకున్న ఆయన.. తనకు ఎదురయ్యే బాధను సైతం ఓర్చుకోవటం విశేషం. దీపావళి సందర్భంగా ప్రతి ఏడాది గోవర్ధన్ పూజను నిర్వహిస్తుంటారు. సంప్రదాయంగా జరిగే ఈ పూజను బంజ్ గిరిలోని గ్రామ పెద్ద భరోసా ఠాకూర్ షురూ చేశారు.
ఆయన మరణం తర్వాత ఆయనకుమారుడు బీరేంద్ర ఠాకూర్ వారసత్వంగా స్వీకరించి ప్రతి ఏటా 0నిర్వహిస్తున్నారు. తాజాగా సీఎం సైతం ఈ పూజలో పాల్గొని రాష్ట్ర ప్రజల కోసం కొరడా దెబ్బలు తిన్న వైనం సంచలనంగా మారింది. తాను కొరడా దెబ్బల్ని తిన్న వైనానికి సంబంధించిన వీడియోను ఆయన షేర్ చేశారు. ప్రజల మనసుల్ని గెలుచుకోవటం కోసం కొరడా దెబ్బలకు సైతం వెనుకాడని సీఎంగా భూపేశ్ నిలుస్తారని చెప్పక తప్పదు.
Full View