ఆర్థిక ప్యాకేజీ ప్రకటనను సీరియల్ తో పోల్చిన సీఎం!

Update: 2020-05-16 07:30 GMT
దేశం మొత్తం ఈ మహమ్మారి కారణంగా లాక్ డౌన్ లోకి వెళ్లిన నేపథ్యంలో ప్రజల కష్టాలని తీర్చడానికి, మంగళవారం ప్రధాని మోడీ జాతినుద్దేశించి మాట్లాడుతూ .. రూ.20 లక్షల కోట్లతో ఆత్మ నిర్భర్ అభియాన్ పేరుతో కొత్త ఆర్థిక ప్యాకేజీను ప్రకటించారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఆర్థిక ప్యాకేజీ ద్వారా ఊతం అందిస్తామని తెలిపారు. దేశంలో ప్రతి పారిశ్రామికుడిని కలుపుకొని పోయేలా ఈ ప్రత్యేక ప్యాకేజీ ఉంటుందని ఆయన చెప్పారు. అయితే, ప్రధాని మోదీ కేవలం ఆర్థిక ప్యాకేజీ మాత్రమే ప్రకటించారు.

ఆ 20 లక్షల కోట్లను ఏయే రంగాలకు ఎంత కేటాయిస్తున్నదీ, అలాగే  దేశంలో అన్ని వర్గాల ప్రజలకూ ఆ రూ.20 లక్షల కోట్లతో ఎలాంటి ప్రయోజనాలు కలగబోతున్నాయో కేంద్ర ఆర్టీకమంత్రి నిర్మలా సీతారామన్ గారు గత మూడు రోజులుగా ప్రకటిస్తూనే ఉన్నారు. ఈ రోజు కూడా ప్యాకేజీ ప్రకటన ఉండబోతుంది. ఈ తరుణంలో లాక్ డౌన్ కాలంలో విడతలవారీగా అన్ని వర్గాలకి ప్యాకేజీ ప్రకటించడాన్ని ఛత్తీస్ ఘడ్ సీఎం భూపేష్ సీరియల్స్ తో పోల్చారు.

"మోదీ ఆత్మ నిర్భర్ అభియాన్ పేరుతో ప్రకటించిన రూ 20 లక్షల కోట్ల ప్యాకేజీని కేంద్రం విడతల వారీగా ఇంగ్లీష్ , హిందీలో ప్రకటన చేస్తోంది. ఇది మూడు రోజులుగా కొనసాగుతుంది అని అయితే, వారు ప్రకటించేది మాత్రం ఎవరికీ అర్థం కావడం లేదు" అని సీఎం తెలిపారు. కాగా , ఈ రోజు కూడా మరికొన్ని రంగాలకి కేంద్రం ప్యాకేజీ ప్రకటించబోతుంది. కాగా, కేంద్రం  తొలి విడత లో ఎంఎస్ ఎం ఈ లు, రెండో విడత లో వలస కూలీలు, చిన్న రైతుల సమస్యలకు పరిష్కారాలు చూపిన కేంద్రం. మూడో విడత ప్రకటన లో సప్లై చైన్ పైనా కీలక అంశాలను ప్రస్తావించారు. ఏదేమైనా ఇప్పుడు ఆర్థిక ప్యాకేజీ ప్రకటన పై సీఎం చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
Tags:    

Similar News