అండర్ వరల్డ్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ కు సంబంధించి కీలక వార్త తెరమీదకు వచ్చింది. దావూద్ ఇబ్రహీం స్వార్థపు ఆలోచనల కారణంగా ఆయన నిర్మించుకున్న డీ గ్యాంగ్ ముక్కలైందని...దావూద్ ఇబ్రహీంకు తన ప్రధాన అనుచరుడు అయిన షకీల్ దూరమైపోయాడని వార్తలు ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇదంతా నిజం కాదని తేలింది. ఎందుకంటే...ఈ విషయమై తాజాగా ఛోటా షకీల్ స్పందించారు.
మాఫియాడాన్ కు రైట్ హాండ్ లాంటి చోటా షకీల్ దావూద్ తో విడిపోయాడని దావూద్ ఇబ్రహీం సోదరుడు అనీస్ ఇబ్రహీం వల్ల ఈ చీలిక వచ్చిందని భారత నిఘా వర్గాలు వెల్లడించాయి. అండర్ వరల్డ్ కార్యకలాపాల్లో చోటా షకీల్ కీ రోల్ ప్లే చేస్తున్నప్పటికీ...ఆయనకు బదులుగా తమ్ముడికి గ్యాంగ్ బాధ్యతలు అప్పగించడంతో...తను హర్ట్ అయి డీ గ్యాంగ్ కు దూరమయ్యానని వచ్చిన వార్తల్లో నిజం లేదని షకీల్ వెల్లడించారు. దావూద్ ఇబ్రహీంతో తనకు ఎలాంటి విభేధాలు లేవని.. తన తుది శ్వాస వరకూ అతనితోనే ఉంటానని ఛోటా షకీల్ తెలిపారు. అండర్ వరల్డ్ లో డీ కంపెనీ కోసమే తాము పనిచేస్తానని ఛోటా షకీల్ స్పష్టం చేసినట్లుగా తెలుస్తుంది.
డీగ్యాంగ్ అండర్ వరల్డ్ కార్యకలాపాల్లో కీలకమైన చోటా షకీల్ దావూద్ తో విడిపోయినట్టు వార్తలు వచ్చిన నేపథ్యంలో పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ ఐ రంగంలోకి దిగిందని కూడా వార్తలు వచ్చాయి. రెండు వర్గాల మధ్యా రాజీ కుదిర్చే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నట్టు సమాచారం. ఇద్దరూ విడిపోతే భారత్‌కు వ్యతిరేకంగా ఏమీ చేయలేమని ఐఎస్ ఐ భావిస్తోందని...డీ గ్యాంగ్ సాయంతోనే భారత్‌లో విధ్వంసాలకు పాల్పడగలుగుతున్న పాక్ ఐఎస్ ఐ ఇప్పుడు వారిద్దరినీ కలపడానికి విశ్వ ప్రయత్నం చేస్తోందని వార్తలు వచ్చాయి.