ఐఎన్ ఎక్స్ మీడియా కేసులో అరెస్ట్ అయ్యి ప్రస్తుతం తీహార్ జైల్లో రిమాండ్ లో ఉన్నారు మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం.. దేశానికి ఆర్థిక - హోంమంత్రిగా చేసిన ఆయన ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు -
ఈరోజు చిదంబరం 74వ పుట్టినరోజు. ఈ సందర్భం చిదంబరంను జైల్లో ఆయన కుటుంబ సభ్యులు కలిశారు. ఈ సందర్భంగా చిదంబరం ఒక రెండు పేజీల లేఖను తన కుమారుడు కార్తికి ఇచ్చారు. కార్తి తాజాగా తండ్రి చిదంబరం ట్విట్టర్ ఖాతాలో దాన్ని పోస్టు చేశాడు. ఇక కాంగ్రెస్ సీనియర్ నేతలు, కేంద్రమాజీ మంత్రులు జైరాం రమేష్ - శశిథరూర్ లు ట్వీట్ల ద్వారా చిదంబరంకు శుభాకాంక్షలు తెలిపారు.
చిదంబరం జైల్లో రాసిన లేఖలో బీజేపీపై ఘాటు విమర్శలు చేశారు. తనపై , దేశంపై బీజేపీ చూపిస్తున్న దమనకాండ - దేశ ఆర్థిక స్థితిగతులపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. తనకు 74 ఏళ్లు వచ్చినా ఇంకా నవయువకుడిగా మారిపోయానని.. దేశ ఆర్థిక విధానాల చుట్టే తన ఆలోచనలు తిరుగుతున్నాయని చిదంబరం బీజేపీకి కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుతం ఎగుమతుల శాతం -6.05గా నమోదై దేశ ఆర్థిక వ్యవస్త దారుణ స్థితికి చేరుకుందని చిదంబరం దుయ్యబట్టారు. ఎన్డీఏ ప్రభుత్వ ఆర్థిక విధానాలపై తాను పోరాటం సాగిస్తానని చిదంబరం ట్విట్టర్ వేదికగా లేఖలో స్పష్టం చేశారు. బీజేపీ పాలనలో ఆర్థికంగా ఇలాంటి స్తితితో భారత్ ను ఆ దేవుడే కాపాడాలని చిదంబరం హెచ్చరికలు చేశారు.