జైలు తిండి తిని చిదంబరం ఎన్ని కేజీల బరువు తగ్గాడంటే ...!

Update: 2019-11-14 09:09 GMT
ఐఎన్ఎక్స్ మీడియా తో పాటు మనీ లాండరింగ్ కు పాల్పడినట్లు పి చిదంబరంపై కేసు నమోదు కావడం తో కొన్ని రోజులు గా అయన తీహార్ జైలు లో ఉంటున్నాడు. చిదంబరంని ఈనెల నవంబర్ 27 వరకు రిమాండ్ పొడిగించడం జరిగింది. చిదంబరం గత కొద్ది రోజులు గా తీవ్ర మానసిక వేదన తో పాటు పేగు లో పూత, అల్సర్ కు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుస్తుంది. దీని తో అతడు జైలు లో ఉన్న కాలం లో దాదాపుగా తొమ్మిది కేజీల బరువు తగ్గాడని అతడి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

జైలు లో అతడికి సరైన చికిత్స అందడం లేదని, అతడిని వెంటనే హైదరాబాద్ లోని గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ నాగేశ్వర్ రెడ్డి దగ్గర చికిత్స కోసం తీసుకొని వెళ్లాలని కోరారు. 2016 లో నాగేశ్వర్ రెడ్డి చికిత్స తరువాత అతడికి కొంత నయమయినట్లు తెలుస్తుంది. ఇప్పుడు మరొక సారి ట్రీట్మెంట్ అవసరమని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. చిదంబరం బెయిల్ పిటిషన్  ఈ నెల 8 నుంచి రిజర్వు చేసి ఉందని అతని బెయిల్ పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వుల కోసం ఎదురు చూస్తున్నామని చెబుతున్నారు.

అంతకు ముందు అయన  బెయిల్ పిటిషన్ ను  న్యాయవాది కొట్టి వేస్తూ, చిదంబరానికి   స్వచ్ఛమైన గాలి, మినరల్ వాటర్, అతడి ఇంటి నుంచి వండిన ఆహారం, దోమల నుంచి రక్షణ కల్పించాలని తీహార్ జైలు అధికారులను ఢిల్లీ హై కోర్టు ఆదేశించింది. చిదంబరంకు వైద్య పరీక్ష కు క్రమం తప్పకుండా చేయాలని కూడా ఆదేశించడం జరిగింది. కానీ అతడి కుటుంబ సభ్యులు అతడి ఆరోగ్యం పై మాత్రం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఐఎన్‌ఎక్స్ మీడియా అవినీతి కేసు లో చిదంబరాన్ని ఆగస్టు 21 న సిబిఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే.


Tags:    

Similar News