అస్సలు సంబంధం లేని నలుగురు స్థాపించిన కంపెనీ ‘అడ్వంటేజ్’. ఇందులో కేవలం 40శాతం వాటా భాస్కర్ రామన్ - సీబీఎన్ రెడ్డి - రవి విశ్వనాథన్ - పద్మా విశ్వనాథన్ లదీ.. మరి మిగిలిన 60శాతం వాటా ఎవరిదంటే ‘అదితి’ అనే అమ్మాయిదీ. ఈడీ వీరి వీలునామా చూస్తే ఈ విషయం బయటపడింది. ఈ ‘అడ్వంటేజ్’ కంపెనీకి చిదంబరం స్థాపించిన ఐ హాస్పిటల్స్ లో ఏకంగా 60శాతం వాటా ఉంది. అడ్వంటేజ్ సంస్థకు అంటార్కిటికా ఖండంలో మినహా ప్రపంచంలోని అన్ని ఖండాల్లో వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులున్నాయి. అందులో 60శాతం వాటా అదితి పేరు మీద ఆ నలుగురు రాశారు. అంటే వేల కోట్లలో 60శాతం అదితిది.. 40శాతం ఆ నలుగురుదీ.. ఆ 40శాతాన్ని తరువాత చిదంబరం కొడుకు కార్తి తన పేరిట రాసుకున్నాడు. షేర్లు బదలాయించుకున్నాడు.
ఇందులో ట్విస్ట్ ఏంటో తెలుసా..? అదితి పూర్తి పేరు అదితి నళినీ చిదంబరం. ఈమె బి. రంగరాజన్ మనవరాలుగా వీలునామాలో చూపించారు. ఇక్కడే భారీ ట్విస్ట్ కుంభకోణం ఉంది. ఇది రెండో కోణం. అదితి తండ్రి కార్తి చిదంబరం.. తల్లి సునిధి చిదంబరం.. స్వయానా ఇప్పుడు అరెస్ట్ అయ్యి రిమాండ్ లో ఉన్న కేంద్రమాజీ మంత్రి చిదంబరం మనవరాలే ‘అదితి’. అదితి తల్లి సునిధి తండ్రే రంగరాజన్. అంటే కోడలి తండ్రిని చూపించి ఇన్ని వేలకోట్లను చిదంబరం తమ మనవరాలి పేరిట రాశారన్నమాట..
కేంద్రంలో యూపీఏ హయాంలో ఆర్థిక - హోంమంత్రిగా ఉన్న చిదంబరం నాడు విదేశాల్లో షెల్ కంపెనీలు సృష్టించి వేల కోట్లను లంచాలుగా తీసుకొని తరలించి నలుగురు బినామీలను ఆ ‘అడ్వంటేజ్’ కంపెనీకి బాధ్యులను చేసి ఈ తతంగాన్ని నడిపినట్టు తాజాగా ఈడీ కనుగొన్నది. ఆ నలుగురు చిదంబరం కుమారుడు కార్తి ఇంటిపక్కనే ఉండే బినామీలేనని ఈడీ విచారణలో తేలిందట.. భాస్కరరామన్ చిదంబరానికి ఆర్థిక వ్యవహారాల మేనేజర్ గా కూడా పనిచేసినట్టు ఈడీ నిగ్గుతేల్చింది.
ఇలా ప్రపంచవ్యాప్తంగా షెల్ కంపెనీల ద్వారా పెట్టుబడులు - విదేశీ అకౌంట్లు - విల్లాలు - టెన్నిస్ క్లబ్బులు సృష్టించి వాటికి ‘అడ్వంటేజ్’ సంస్థను దేశంలో నియమించి అందులో ఏకంగా 60శాతం వాటాను మనవరాలిపై ఎవరికీ అనుమానం రాకుండా చిదంబరం వీలునామా రాయించాడు. ఇక మిగిలిన 40శాతం వాటాను కూడా కార్తి చిదంబరం తన పేరిటకు మార్చుకున్నాడని ఈడీ గుర్తించింది. ఇన్ని వేల కోట్ల అవినీతి స్రామాజ్యాన్ని స్థాపించిన చిదంబరం ను అరెస్ట్ చేశాక ఈ బాగోతాలన్నీ బయటపడుతున్నాయి.