తనపైనా.. తన కుమారుడి ఇంటిపైనా.. సీబీఐ చేస్తున్న దాడులపై మాజీ కేంద్రమంత్రి చిదంబరం స్పందించారు. కేవలం రాజకీయ కక్షతోనే తనపైన కేంద్రం సీబీఐ దాడులు చేయించినట్లుగా ఆయన ఆరోపించారు. ఎయిల్ సెల్ - యాక్సిస్ కేసు దర్యాప్తులో భాగంగా ఈ రోజు ఉదయం ఆయన ఇంటిపైనా.. ఆయన కుమారుడు కార్తీ చిదంబరం ఇంటిపైనా ఏకకాలంలో సీబీఐ సోదాలు నిర్వహించటం తెలిసిందే. దీనిపై స్పందించిన చిదంబరం.. తాను ఏ రోజూ చట్టాన్ని ఉల్లంఘించలేదని.. వ్యవస్థల్ని కేంద్రం దుర్వినియోగం చేస్తుందన్నారు.
తనను కావాలనే టార్గెట్ చేసినట్లుగా ఆరోపించిన చిదంబరం.. తన గొంతు నొక్కకేందుకు కేంద్రం దర్యాప్తుల పేరుతో సీబీఐ చేత దాడులు చేయించి కుట్రలు పన్నుతుందన్నారు. తాజాగా చేస్తున్న దాడులకు తాను భయపడేది లేదని.. తన కొడుకు.. అతడి స్నేహితుల్ని లక్ష్యంగా చేయటంపై ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
కేవలం సంచలనాల కోసమే ఇలాంటి దాడులు నిర్వహిస్తున్నారే తప్పించి.. మరెలాంటి ఉద్దేశం లేదన్న కాంగ్రెస్ నేతలు పలువురు చిదంబరం నివాసంపై సీబీఐ దాడులు నిర్వహించటాన్ని ఖండించారు. సీబీఐ సోదాల్ని ఖండించిన వారిలో కాంగ్రెస్ సీనియర్ నేతలు దిగ్విజయ్ సింగ్.. టామ్ వడక్కన్ తదితరులు ఉన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/