వరుసగా రెండు పర్యాయాలు కేంద్రంలో రికార్డు మెజారిటీతో అధికారం చేపట్టిన బీజేపీని ఢీకొట్టడంలో గ్రాండ్ ఓల్డ్ పార్టీ కిందామీదా పడుతోన్న విషయం తెలిసిందే. ఏ విషయం తెర మీదకు వచ్చినా... దానిపై తనదైన శైలిలో వితండ వాదనలు వినిపిస్తున్న కాంగ్రెస్ పార్టీ నేతలు.. బీజేపీని ఇరుకున పెట్టేందుకు యత్నిస్తున్న వైనం కూడా మనకు కొత్తేమీ కాదు. ఈ తరహా యత్నాల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత - కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం ఇప్పుడు ఏకంగా రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను టార్గెట్ చేస్తూ సంచలన ట్వీట్లు చేశారు. చైనాతో నెలకొన్న సరిహద్దు వివాదం నేపథ్యంలో వాస్తవాలను బీజేపీ సర్కారు బయటకు చెప్పడం లేదన్న వాదనను బయటకు తీసిన చిద్దూ... ఈ వ్యవహారంలో రాజ్ నాథ్ ఏకంగా రక్షణ శాఖ నుంచే బయటకు వెళ్లిపోయే ప్రమాదం లేకపోలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.
లడక్ సమీపంలో వాస్తవాధీన రేఖ వెంట చైనా ఆర్మీ భారత భూభాగంలోకి చొచ్చుకుని వచ్చి పెను వివాదానికే తెర తీసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భారత్ వైపు కొందరు జవాన్లు మృత్యువాత పడగా... చైనా వైపు నుంచి కూడా రెట్టింపు సంఖ్యలో జవాన్లు చనిపోయారు. ఈ వ్యవహారంపై బీజేపీ సర్కారు నిజాలను దాస్తోందని చాలా కాలం నుంచి కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు గుప్పిస్తోంది. అయితే దేశ రక్షణకు సంబంధించిన వాస్తవాలను ఎంతోకాలం దాచలేరని - ఎన్నటికైనా అవి బయటకు వచ్చి తీరతాయని చిదంబరం చెబుతున్నారు. అలాంటి ఘటనే ఇప్పుడు రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన వెబ్ సైట్ లో చోటుచేసుకుందని కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మొత్తం తతంగం చూస్తుంటే... రాజ్ నాథ్ ను రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి బయటకు పంపేందుకు పక్కాగా ప్లాన్ అమలు అవుతోందని కూడా ఆయన వ్యాఖ్యానించారు.
రక్షణ మంత్రి హోదాలో ఉన్న రాజ్ నాథ్ ఆ పదవి నుంచి దిగిపోకపోయినా... రక్షణ శాఖకు చెందిన ఓ కీలక అధికారి అయినా బలి కావడం ఖాయమని చిదంబరం చెప్పుొచ్చారు. అంతేకాకుండా రక్షణ మంత్రిత్వ శాఖలో ఏకంగా చైనా ఏజెంట్ ఒకరు ఉన్నారని కూడా చిద్దూ మరింత సంచలన కామెంట్ చేశారు. మొత్తంగా బీజేపీ సర్కారు చాలా కాలం నుంచి దాస్తూ వస్తున్న నిజాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయంటే... ఆ శాఖ మంత్రిగా ఉన్న రాజ్ నాథ్ పరువును తీయడం కాకపోతే మరేమిటని కూడా చిద్దూ ప్రశ్నిస్తున్నారు. రాజ్ నాథ్ పదవికి ముప్పు పొంచి ఉందని చెప్పడంతో పాటుగా ఏకంగా భారత రక్షణ మంత్రిత్వ శాఖలో ఏకంగా చైనా ఏజెంట్ ఉన్నారంటూ చిద్దూ చేసిన ట్వీట్లు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయాయి. మరి చిద్దూ ట్వీట్లకు బీజేపీ సర్కారు నుంచి ఎలాంటి కౌంటర్ పడుతుందో చూడాలి.