ప్రభుత్వాల పనితీరుపై సీజేఐ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాలు న్యాయవ్యవస్థపై నిర్లక్ష్యంగా ఉన్నాయనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ప్రభుత్వాలు న్యాయవ్యవస్థను చిన్నచూపు చూస్తున్నాయని అన్నారు.
విజయవాడలో కోర్టు భవన నిర్మాణ పూర్తవకపోవడంపై సీజేఐ రమణ అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారినా బిల్డింగ్ పూర్తవకపోవడం దారుణమని అన్నారు. ప్రభుత్వాలు న్యాయవ్యవస్థ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని సీజేఐ అన్నారు. ఏపీ గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్ ఏర్పాటు చేసిన తేనీటివిందుకు సీజేఐ హాజరయ్యారు.
ఇక ప్రజలకు కోర్టులపై నమ్మకం ఉంది కనుకనే 4 కోట్ల కేసులు కోర్టుల్లో ఉన్నాయని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. న్యాయమూర్తులకు జరిగే అవమానాలను ప్రశ్నించాల్సిన సమయం వచ్చిందని.. వ్యవస్థలన్నీ కలిసి పనిచేయకపోతే చివరకు చేరేది న్యాయవ్యవస్థ వద్దకేనని.. డబ్బులు లేక న్యాయం జరగలేదనే పరిస్థితి రాకూడదని సీజేఐ అన్నారు.
టెక్నాలజీ కోసం సబ్సిడీలు ఇచ్చి సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వాలను కోరామని సీజేఐ చెప్పుకొచ్చారు. అయితే ఇంతవరకూ ప్రభుత్వం నుంచి స్పందన రాలేదన్నారు. ప్రజలకు న్యాయం జరుగుతుందనే భరోసా కల్పించాలని సీజేఐ అన్నారు. న్యాయవాదులు కూడా పేదలకు ఉచిత న్యాయం అందేలా చూడాలని కోరారు.