మహిళల వస్త్రధారణపై ముఖ్యమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు!

Update: 2021-03-17 13:55 GMT
మ‌హిళ‌లు ఎలా ఉండాలో.. యువ‌తులు ఎలాంటి దుస్తులు వేసుకోవాలో ఇప్ప‌టి వ‌ర‌కు చాలా మంది శాస‌నాలు చేశారు. వారిలో తాజాగా సాక్షాత్తూ ఓ ముఖ్య‌మంత్రి కూడా చేరిపోవ‌డం గ‌మ‌నార్హం. ఉత్త‌రాఖండ్ నూత‌న ముఖ్య‌మంత్రి తీర‌థ్ సింగ్ రావ‌త్‌.. మ‌హిళ‌ల వ‌స్త్రధార‌ణ‌పై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు.

టాన్ జీన్స్ ఇప్పుడు ఫ్యాష‌న్ గా ట్రెండింగ్ లో ఉన్న విష‌యం తెలిసిందే. చాలా మంది యూత్ అలాంటి జీన్స్ వేసుకోవ‌డాన్ని ఇష్ట‌ప‌డుతున్నారు. అయితే.. యువ‌తులు అలాంటి దుస్తులు వేసుకోవ‌ద్ద‌ని ముఖ్య‌మంత్రి చెప్ప‌డం గ‌మ‌నార్హం.

అంతేకాదు.. త‌ల్లిదండ్రుల‌ను కూడా ఆయ‌న టార్గెట్ చేసి మాట్లాడారు. ఇంట్లో పిల్ల‌ల‌కు ఏం నేర్పుతున్నారు? స‌మాజానికి ఏం సందేశం ఇస్తున్నారంటూ? వ్యాఖ్యానించారు. మనం ఎలా ప్రవర్తిస్తే.. పిల్లలు కూడా పెద్దయ్యాక అలాగే తయారవుతారని అన్నారు. వెస్ట్రన్ పిచ్చిలో మనం మన సంస్కృతిని మ‌రిచిపోతున్నామ‌ని చెప్పుకొచ్చారు ముఖ్య‌మంత్రి.
Tags:    

Similar News