తీరికలేని రాజకీయాలతో నిత్యం బిజీ బిజీగా ఉండే ముఖ్యమంత్రి.. కళాకారులతో కలిసి నృత్యం చేశారు! మహిళలతో కలిసి సంప్రదాయ నృత్యంలో కాలు కదిపారు. ఆ సీఎం మరెవరో కాదు.. పశ్చిమ బెంగాల్ చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ!
అలీపుర్దార్ జిల్లా ఫలకటా ప్రాంతంలో ఓ స్వచ్ఛంద సంస్థ మంగళవారం సామూహిక వివాహాలు నిర్వహించింది. ఈ వేడుకలో సీఎం మమతా బెనర్జీ ముఖ్య అతిథిగా పాల్గొని, కొత్త జంటలను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా అక్కడ గిరిజన సంప్రదాయ నృత్యం చేస్తున్న మహిళల వద్దకు వెళ్లారు. వారిలో కలిసిపోయిన మమతా.. ఉత్సాహంగా వారి నృత్యం చేశారు. దీంతో.. అక్కడున్న వారంతా ఈలలు.. చప్పట్లతో ఉత్సాహ పరిచారు.
అయితే.. మమతాబెనర్జీ నృత్యం చేయడం ఇదే మొదటిసరి కాదు. సందర్భం వచ్చినప్పుడల్లా నృత్యాలు చేస్తూ ఆకట్టుకుంటారు. ఇంతేకాకుండా.. పుస్తకాలు రాయడం, పెయింటింగ్ వేయడం వంటి హాబీలు కూడా మమతకు ఉన్నాయి.
కాగా.. బెంగాల్‌లో మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో టీఎంసీని ఢీకొట్టేందుకు బీజేపీ సిద్ధమవుతోంది. రెండు సార్లు బెంగాల్ ముఖ్యమంత్రిగా ఎన్నికైన మమత.. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని తీవ్రంగా శ్రమిస్తున్నారు.