ఏపీలో సీబీఐకి నో చెప్పిన చంద్రబాబును మోడీ వ్యతిరేక వర్గమంతా ఇప్పుడు హీరోలా చూస్తోంది. అంతేకాదు.. మమత - కుమారస్వామి వంటివారు ఈ విషయంలో ఆయన్ను ఫాలో అయిపోయారు. మోదీని ఎదిరించే మొనగాడు చంద్రబాబు మాత్రమే అని దేశంలో చాలామంది ఇప్పటికే డిసైడైపోయారట. అయితే... సీబీఐ విషయంలో ఉన్న ఒక సెంటిమెంట్ - గత అనుభవాలను గుర్తు చేస్తున్నవారు మాత్రం చంద్రబాబు జైలు కెళ్లడం ఖాయమంటున్నారు. అందుకు ఉదాహరణలు కూడా చూపిస్తున్నారు. గతంలో ఇలాగే సీబీఐకి ఆటంకం కలిగించే జీవోలు ఇచ్చిన సీఎంలంతా ఆ తరువాత ఎన్నికల్లో ఓటమి పాలై కేసుల్లో చిక్కుకుని జైలు ఊచలు లెక్కబెట్టారట.
సీబీఐని అడ్డుకున్న వీరుడు ఒక్క చంద్రబాబే కాదు - గతంలో ఇలాంటి సీఎంలున్నారు. అయితే.. వారందరికీ చివరికి ఏమైంది.. వారి రాజకీయ జీవితం ఏమైందో చూద్దాం.
సీబీఐతో ఆట అంటే లాలూ పేరు తొలుత చెప్పుకోవాలి. దాణా కుంభకోణంలో చిక్కుని సీబీఐ దృష్టిలో పడ్డారు. అయితే, విచారణను తప్పించుకోవడానికి ఆ సంస్థను రాష్ట్రంలోకి రాకుండా జీవో ఇచ్చారు. సుప్రీంకోర్టు దాన్ని కొట్టేయడంతో సీబీఐ విచారణ జరిపి ఆయన్ను జైలుకు పంపింది. ఆ తరువాత రాజకీయంగా ఆయన బాగా వీకైపోయారు.
హిమాచల్ ప్రదేశ్ సీఎంగా పనిచేసిన కాలంలో వీరభద్రసింగ్ పై అవినీతి ఆరోపణలు వచ్చాయి. కేసు సీబీఐ చేతికి వెళ్లింది. దీంతో సింగ్ సీబీఐను అడ్డుకుంటూ జీవో జారీ చేశారు. కానీ - కోర్టు ఆ జీవోను కొట్టేసింది. తరువాత కేసు విచారణ జరిగి వీరభద్రసింగ్ తో పాటు ఆయన భార్య కూడా జైలు కెళ్లాల్సి వచ్చింది.
జార్ఖండ్ లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచి లక్కీగా ముఖ్యమంత్రయిపోయిన మధుకోడా కొద్దికాలంలోనే అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. దీంతో సీబీఐ ఎంటరైంది. ఆయన అంతే స్పీడుగా స్పందించి సీబీఐ ప్రవేశాన్ని నిరాకరిస్తూ జీవో జారీ చేశారు.. కానీ, దిల్లీ కోర్టు కొట్టేసింది. దాంతో సీబీఐని ఆయన ఆపలేకపోయారు. చివరకు ముఖ్యమంత్రి హోదాలోనే అరెస్టై జైలు ఊచలు లెక్కపెట్టారు.
ఇక మన పొరుగు రాష్ట్రం కర్ణాటకలో యడ్యూరప్ప కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మైనింగ్ కేసుల్లో ఉన్న గాలి జనార్దన రెడ్డిని వెనకేసుకొచ్చారాయన. సీబీఐ విచారణను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. కానీ హై కోర్టు ఉత్తర్వులను కొట్టేసింది. దాంతో సీబీఐ తన పని మొదలుపెట్టి యడ్యూరప్పను జైలుకు పంపింది.
ఇప్పుడు ఏపీలో సీఎం చంద్రబాబు కూడా సీబీఐకి జనరల్ కన్సెంట్ రద్దు చేశారు. ఆయన పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు సిఎం రమేష్ - సుజనా చౌదరి తదితరులపై ఈడీ - ఐటీ రైడ్లు జరగడం.. జగన్ పై హత్యాయత్నం కేసులు వచ్చి పడడంతో ఆయన కంగారు పడి సీబీఐకి నో ఎంట్రీ బోర్డు పెట్టారు. మరి.. చంద్రబాబు పరిస్థితి ఏమవుతుందో చూడాలి.