ఏడో వేతన సవరణ సంఘం చేసిన సిఫార్పులు ఆసక్తికరంగా మారాయి. ఇప్పటికే భారీ వేతనాన్ని పెంచుతూ సిఫార్సులు చేయటం తెలిసిందే. ఒకవైపు భారీ వేతనంతోపాటు.. ఉద్యోగులకు మరిన్ని సౌకర్యాల దిశగా అడుగులు వేయటం విశేషం.
ఇప్పటి వరకూ మహిళా ఉద్యోగిణులకు పిల్లల్ని పెంచేందుకు వీలుగా సెలవును ఇస్తున్నారు. ఇందుకోసం తమ పదవీకాలంలో రెండేళ్ల వరకూ సెలవు తీసుకునే అవకాశం వారికి కల్పిస్తారు. అయితే.. మహిళలకు మాత్రమే ఉన్న ఈ సౌకర్యాన్ని.. మగవారికి కూడా కల్పించాలని భావిస్తున్నారు. ఇందుకోసం కొన్ని సిఫార్పులు చేశారు. తాజా సిపార్సుల ప్రకారం ఇప్పటివరకూ మహిళా ఉద్యోగిణులకు మాత్రమే ఉన్న పిల్లల పెంపకం సెలవుల్ని మగ ఉద్యోగులకు సైతం ఇవ్వాలని ప్రతిపాదించింది.
అయితే.. ఈ సెలవు ఒంటరి తండ్రులకు మాత్రమేనని స్పష్టం చేసింది. ఒంటరి తండ్రులకు తమ పిల్లల్ని పెంచటంలో భాగంగా వారికి కూడా రెండేళ్ల సెలవును మంజూరు చేయాలని సిఫార్సు చేశారు. మొదటి సంవత్సరం వందశాతం జీతం చెల్లించేలా.. రెండో ఏడాది 80 శాతం జీతం ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నారు. అదే సమయలో ఒంటరి మహిళలకు పిల్లల పెంపకానికి సంబంధించి ఏడాదిలో మూడు దఫాలు మాత్రమే సెలవులు తీసుకునే వెసులుబాటు ఉంది. దాన్ని ఆరుసార్లకు పెంచాలని సిఫార్సు చేశారు.