పోలీస్ స్టేషన్ లో పిల్లాడి పెన్సిల్ పంచాయితీ.. ఆర్నెల్ల క్రితం వీడియో వైరల్
ఐదుగురు పిల్లలు. వారంతా మూడు.. నాలుగో తరగతి చదివే పిల్లలు. వారంతా పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. అందరిలోకి చిన్న పిల్లాడు కోపంగా.. ఈడి మీద కేసు పెట్టండి సార్.. అంటూ కంప్లైంట్ చేశాడు. వెనకున్న ముగ్గురు పిల్లలు నవ్వుతుంటే.. ఈ పిల్లాడు అదేమీ పట్టలేదు సరికదా.. తనకు జరుగుతున్న అన్యాయం గురించి చెప్పి.. ‘నా పెన్సిల్ ఎత్తేసినవ్. ఈడి మీద కేసు పెట్టండి’ అన్న పిల్లాడి పెన్సిల్ పంచాయితీకి సంబంధించిన రియల్ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.
అందరూ ఎంతో ఆసక్తిగా చూస్తున్న ఈ రెండునిమిషాలకు పైనే ఉన్న ఈ చిట్టి వీడియో ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారటమే కాదు.. ఈ వీడియో చూసినోళ్లంతా పిల్లల పంచాయితీకి తెగ నవ్వేసుకుంటున్నారు.
నిజానికి ఈ వీడియో ఆర్నెల్ల క్రితం నాటిది. కానీ.. దీన్ని స్నేహితులకు సరదాగా ఫార్వడ్ చేయటం.. వారు ఒక గ్రూపులో వేయటం.. దాంతో ఈ వీడియో చక్కర్లు తిరుగుతూ.. తిరుగుతూ ఇప్పుడు మీడియాలోనూ ఆసక్తికర వార్తగా మారింది.
కర్నూలు జిల్లా పెద్దకడబూరుకు చెందిన విద్యార్థి ఒకడు ఒక ప్రైవేటు స్కూల్లో చదువుతున్నాడు. తన ఇంటి పక్కనే ఉన్న స్నేహితుడు రోజూ తన పెన్సిల్ తీసేసుకుంటుండటంతో విసిగిపోయాడు.
స్నేహితుల్ని వెంట పెట్టుకొని పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. తన వెంట.. పెన్సిల్ చోరీ చేస్తున్న మిత్రుడ్ని తీసుకెళ్లాడు. తనకు న్యాయం చేయాలని పంచాయితీ పెట్టాడు. ‘ఆడి మీద కేసు పెట్టాలె’ అంటూ పిల్లాడి ముఖం సీరియస్ గా చెప్పేయటం చూసినప్పుడు నవ్వు ఆగదు. అయితే.. అక్కడున్న పోలీసులు.. ఈ విషయాన్ని జాగ్రత్తగా డీల్ చేసి.. ఆగ్రహంతో వచ్చిన పిల్లాడి (హనుమంతు)ని సముదాయించారు.
‘‘హనుమంతు పెద్ద మనసు చేసుకో. కేసు పెడితే జైలుకు పంపాల. బెయిల్ తెచ్చుకోవటం.. తల్లిదండ్రలను పోలీసు స్టేషన్ కు తీసుకురావాల్సి ఉంటుంది. అవన్నీ కష్టం కదా హనుమంతు.. కాస్త పెద్ద మనసు చేసుకో.
ఈ సారికి క్షమించు’’ అంటూ అక్కడి కానిస్టేబుల్ అనునయంగా చెప్పి.. వారిద్దరి మధ్య రాజీ కుదిర్చి.. చేతిలో చేయి వేయించి.. స్నేహితులుగా ఉండాలని చెప్పి పంపారు. బాగా చదువుకోవాలన్న పోలీసు మాటకు అన్యమనస్కంగా హనుమంతు ఒప్పుకున్నాడు.
స్నేహితుడి చేతిలో చేయి వేశాడు. మొత్తంగా పోలీస్ స్టేషన్ లో పిల్లల పెన్సిల్ పంచాయితీ వీడియో నవ్వులు పూయిస్తోంది. మరిక ఆలస్యం ఎందుకు.. మీరూ ఆ వీడియోను చూసేయండి.
Full View