పైన మీకు కనిపిస్తోన్న ఫొటోలో స్టైల్ గా ఓ వైపుకి వంగి ఫోటోకి పోజిచ్చిన కుర్రాడు ఎవరో గుర్తుపట్టారా , ఆ ఫొటోలో పోజిస్తున్న కుర్రాడు ఇప్పుడు ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. అనుకోని కొన్ని కారణాలతో జాతీయ పార్టీ తో విభేదించి , సొంతగా పార్టీ పెట్టి తండ్రి ఆశయాలని నిలబెట్టడమే ద్యేయంగా రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగి , గత సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ ఏ పార్టీ కూడా గెలవనటువంటి భారీ సీట్లు గెలిచి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. యంగ్ సీఎంగా దేశ రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు. ఇంకా మీరు ఈ పిల్లాడు ఎవరో గుర్తుపట్టలేకపోతున్నారా అయితే , ఈ స్టోరీని పూర్తిగా చదివేయండి..
ఈ ఫొటోలో ఉన్న చిన్న పిల్లాడు మరెవరో కాదు యంగ్ అండ్ డైనమిక్ , ఆంధప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ రాజకీయాల్లోనూ ఎంతో పాపులర్. మాట తప్పను మడమ తిప్పను అంటూ రాజకీయాల్లో సరికొత్త ఒరవడికి నాంది పలికారు జగన్. తాను నమ్మిన సిద్ధాంతం కోసం ఎంత దూరమైనా వెళతాను అని చెప్పే జగన్ మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ ప్రజల మనసును చోరగొన్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అతి చిన్న వయసులో ముఖ్యమంత్రి పదవిని అధిరోహించిన అతి కొద్ది మంది రాజకీయ నాయకుల్లో ఒకరిగా పేరు సంపాదించుకున్నారు.
ఇదిలా ఉంటే నిత్యం రాజకీయాలతో బిజీగా ఉండే జగన్ కుటుంబానికి కూడా సమయం కేటాయిస్తారనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సమయం చిక్కినప్పుడల్లా విదేశాలకు వెళ్లే జగన్ అక్కడ సరదాగా గడుపుతుంటారు. జగన్ మోహన్ రెడ్డి విహార యాత్రలకు సంబంధించిన ఫొటోలు అప్పుడప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. ఇక జగన్ మోహన్ రెడ్డి చిన్నతనమంతా హైదరాబాద్ లోనే సాగిందని అందరికీ తెలిసిందే. సినిమా ఇండస్ట్రీకి చెందిన అక్కినేని సుమంత్, జగన్ లు మంచి స్నేహితులు. చదువుకునే రోజుల్లో వీరిద్దరూ చేసిన హంగామా అంతా ఇంత కాదని గతంలో సుమంత్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
ఇక జగన్ మోహన్ రెడ్డి తన విద్యాభ్యాసాన్ని బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో పూర్తి చేశారు. ఆ తర్వాత నిజాం కాలేజీలో బీకాం చదివారు. ఆ తర్వాత లండన్ లో ఎంబీఏ చేయడానికి వెళ్లారు. ఇక జగన్ 1996లో భారతిని వివాహం చేసుకున్నారు. జగన్‌కు వర్ష రెడ్డి, హర్ష రెడ్డి అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకుగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన జగన్.. 2019లో సీఎం పీఠాన్ని అధిష్టించారు. ఏపీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ప్రభంజనం సృష్టించింది. ఈ ఘనవిజయం జగన్‌కు అంత తేలిగ్గా ఏం దక్కలేదు. కడప ఎంపీగా గెలుపొంది, రాజకీయాల్లోకి అడుగుపెట్టిన జగన్.. ఈ పదేళ్లలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. అక్రమంగా లక్ష కోట్లు సంపాదించాడని విపరీతంగా ప్రచారం చేసినా.. కేసులు మోపు జైల్లో పెట్టినా.. అనుకున్న లక్ష్యం కోసం మొండిగా పోరాడారు. మరొకరైతే ఒత్తిడికి లొంగిపోయేవారేమో.. కానీ జగన్ మాత్రం మొక్కవోని సంకల్పంతో అనుకున్నది సాధించారు.
2009 ఎన్నికల్లో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన జగన్.. కడప ఎంపీగా గెలుపొందారు. కానీ అదే కొద్ది నెలల వ్యవధిలోనే.. సెప్టెంబర్ 2న వైఎస్ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. వైఎస్ మరణం తర్వాత.. జగన్‌ని ముఖ్యమంత్రిని చేయాలని కోరుతూ.. ఎమ్మెల్యేలందరూ సంతకాలు చేసిన లేఖను పార్టీ అధిష్టానానికి పంపారు. కానీ కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం జగన్‌ను సీఎం చేయడానికి అంగీకరించలేదు. ఆ తర్వాత జగన్ ‘ఓదార్పు యాత్ర’కు శ్రీకారం చుట్టారు. దీనికి కాంగ్రెస్ పెద్దలు సమ్మతించలేదు. విజయమ్మ ఢిల్లీ వెళ్లి కోరినా ఫలితం కనిపించలేదు. కాంగ్రెస్ హైకమాండ్ తో విబేధించిన జగన్.. ధైర్యంగా అడుగు ముందుకేసి.. తన తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక చనిపోయిన వారి కుటుంబీకులను ఓదార్చడం కోసం ‘ఓదార్పు యాత్ర’ ప్రారంభించారు. మీరంతా నా కుటుంబ సభ్యులేనని వారిలో భరోసా నింపారు.
2010లో కాంగ్రెస్‌కు, పదవులకు రాజీనామా చేసిన జగన్, విజయమ్మ.. తన తండ్రి పేరు కలిసొచ్చేలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేశారు. ప్రభుత్వంపై జగన్ అవిశ్వాస తీర్మాన ప్రవేశపెట్టగా.. 17 మంది ఎమ్మెల్యేలు ఆయనకు అండగా నిలిచారు. వారిపై అనర్హత వేటు పడటంతో.. ఉపఎన్నికల్లో గెలిపించుకున్నారు. తర్వాత జగన్‌పై రకరకాలుగా ఒత్తిడి పెరిగింది. కానీ స్వతహాగా మొండి వాడయిన జగన్ వెనక్కి తగ్గలేదు. 16 నెలల జైలు జీవితం. ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్న బెయిల్ లభ్యం కాలేదు.
వైఎస్ కొడుకనే అభిమానం ఉన్నప్పటికీ.. 2014 ఎన్నికల్లో ,జగన్ వస్తాడని బలంగా నమ్మినప్పటికీ.. చంద్రబాబు, మోదీ, పవన్ కళ్యాణ్ కూటమి బలం ముందు స్వల్ప తేడాతో జగన్ అధికారానికి దూరమయ్యారు. తన మాస్ ఇమేజీకి, వ్యూహరచన తోడు కావాలని భావించిన జగన్ , ప్రశాంత్ కిశోర్ టీం సలహాలు కోరారు. 2019 ఎన్నికల్లోనూ ఓడిపోతే వైఎస్ఆర్సీపీ కనుమరుగయ్యే పరిస్థితి. ఈ తరుణంలో జగన్ జనాన్ని నమ్ముకున్నారు. తన తండ్రి చూపిన బాటలో పయనించి,ఎన్నికలు సుదూరంగా ఉండగానే పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. 341 రోజులపాటు 113 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు 3648 కి.మీ. పాదయాత్ర చేశారు. 36 ఏళ్ల వయసులో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన జగన్.. ఈ పదేళ్ల రాజకీయ జీవితంలో మరే ఇతర నాయకుడూ ఎదుర్కోనన్ని ఇబ్బందులు పడ్డారు.