కరోనా కట్టడిలో భాగంగా దేశం మొత్తం లాక్ డౌన్ అమలులో ఉంది. ఆఫీసులు మూతపడటం, రవాణా లేకపోవడతంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. రోజు మొత్తం ఏం చేయాలో తోచట్లేదు. ఇక స్కూళ్లు, కాలేజీలు కూడా మూతపడటంతో యువకులు, విద్యార్థులు కూడా ఇళ్లలోనే ఉండాల్సి వస్తోంది. అయితే, కాలక్షేపం కావడం కోసం చాలా మంది కొత్త దారులు వెతుకుతున్నారు. కుటుంబాలతో కలిసి ఉండేవారిని మినహాయిస్తే, ఒంటరిగా ఉంటున్నవారు, లేదా ఒక్కరే ఉండి వర్క్ ఫ్రం హోం చేస్తున్నవారు ఎక్కువగా అడల్ట్ కంటెంట్ కోసం వెతుకుతున్నట్లుగా తేలింది.
ఒక సర్వే ప్రకారం సాధరణ రోజుల్లో కంటే .. ఈ లాక్ డౌన్ అమల్లోకి వచ్చాక ఆన్‌లైన్‌లో అశ్లీల సైట్ల వాడకం 95 శాతం పెరిగింది. ఇందులో 89 శాతం మంది తమ మొబైళ్ల ద్వారానే అశ్లీల వెబ్‌సైట్లను చూస్తున్నారు. ఇక ఇండియాలో పోర్న్ యూజర్లలో 30-40 శాతం మంది రోజూ అశ్లీల వీడియోలను డౌన్ లోడ్ చేసుకుంటున్నారు. దేశంలో 3500 పోర్న్ వెబ్ సైట్లపై నిషేధం ఉన్నప్పటికీ... ఎలాగొలా వేరే వెబ్ సైట్లు వెతుక్కొని చూస్తున్నారు.పెద్దవాళ్లు చూసినా పర్లేకానీ, కౌమారదశలో ఉన్నవారు అశ్లీల వీడియోలను ఎక్కువగా చూడడం ఆందోళనను కలిగిస్తోంది.
కొన్నేళ్ల కిందట బెంగళూరులోని 10 స్కూళ్లలో చదువుకుంటున్న 400 మంది విద్యార్థులపై ఓ సర్వే చేయగా.. కనీసం 70శాతం మంది అశ్లీల చిత్రాలు చూస్తున్నారని తేలింది. వీరంతా కూడా 10 ఏళ్లలో ఉండడం గమనార్హం. వెలాసిటీ ఎంఆర్ అనే పరిశోధనా సంస్థ ప్రకారం, భారతదేశంలోని పెద్ద నగరాల్లో నివసిస్తున్న తల్లిదండ్రులలో 90 శాతం మంది తమ పిల్లలకు చదువులో ఇంటర్నెట్ సహాయపడుతుందని భావిస్తున్నారు. ప్రతి పదిమందిలో 9 మంది విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలు ఇంటర్నెట్‌ను కేవలం చదువుకు కోసం మాత్రమే వినియోగిస్తున్నారని భావిస్తున్నారట. పిల్లలు మొబైల్ లో ఎలాంటి వీడియోలో చూస్తున్నారో కూడా వారి పరిశీలించడం లేదట. ఆరు, ఏడేళ్ల పిల్లలు కూడా అశ్లీల వీడియోలు చూస్తుండడం ఆందోళన కలిగించే అంశం.
ఇండియాలో 4జీ ఇంటర్నెట్ కాస్త చవకగా అందుబాటులోకి వచ్చిన తర్వాత మొబైల్ ఇంటర్నెట్ వాడకం బాగా పెరిగింది. అదే సమయంలో డేటింగ్ సైట్లు, బూతు సైట్లు కూడా ఎక్కువయ్యాయని ఆ సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ముఖ్యంగా యూత్‌కి ఎరోటిక్ కంటెంట్ అలవాటు చేసి వారి నుంచి డబ్బు లాగేస్తున్నాయి చాలా సైట్లు. ప్రపంచంలో అమెరికా, బ్రిటన్ తర్వాత ఎక్కువగా పోర్నోగ్రఫీ కంటెంట్ చూస్తున్నది భారతీయులేనట.