సుజి చింపాంజి ఎందుకు బయటకు వచ్చిందో తెలుసా?

Update: 2019-10-01 06:37 GMT
ఫ్రెండ్లీగా ఉండే చింపాంజీ దాడి చేయటమా? అది కూడా ఎన్ క్లోజర్ నుంచి బయటకురావటమా? తనకు సుపరిచితమైన హెడ్ మాలిపై దాడి చేయటమా? లాంటి సందేహాలు తాజా ఉదంతం వింటే రాక మానదు. హైదరాబాద్ నెహ్రూ జూపార్క్ లో సుజి చింపాంజి ఎన్ క్లోజర్ నుంచి బయటకు రావటమే కాదు.. అక్కడ పని చేసే హెడ్ మాలీ యాదయ్యపైన దాడికి పాల్పడింది.

ఎందుకిలా చేసింది? అన్న విషయంలోకి వెళితే.. అయ్యో అనిపించే విషయాలు బయటకు వస్తాయి. దాదాపు ఎనిమిదేళ్ల క్రితం అంటే 2011లో సహారా చీఫ్ సుబ్రతోరాయ్ చింపాంజి సుజిని నెహ్రూ జూపార్క్ కు బహుమతిగా ఇచ్చారు. ఆడదైన సుజి.. అప్పటి నుంచి ఒంటరిగానే ఉంటోంది. ఏకాకిగా ఉంటున్న సుజి తోడు కోసం తపిస్తోంది. అయినా.. ఈ విషయాన్ని జూ అధికారులు పట్టించుకోకపోవటం లేదు.

ఇదిలా ఉంటే.. ఈ మధ్యన సుజి అనారోగ్యానికి గురైంది. దీనికి కారణం కూడా ఒంటరితనం భరించలేకనే అంటున్నారు. ఇలాంటివేళ.. తనకున్న కోపాన్ని తీర్చుకునేందుకు తనను ఉంచిన ఎన్ క్లోజర్ బయటకు వచ్చిన సుజి.. అక్కడున్న హెడ్ మాలిపై దాడి చేశారు. దీంతో.. దానిపై మత్తుమందు ప్రయోగించి.. అదుపులోకి తీసుకొని ఎన్ క్లోజర్ లోకి పెట్టేశారు. మనిషి కానీ జంతువు కాని ఏ టైంలో జరగాల్సినవి ఆ టైంలో జరిగితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. లేకుంటే.. ఇలాంటివి తప్పవు. మరి.. ఇప్పటికైనా తోడు కోసం తపిస్తున్న సుజి విషయాన్నిజూ అధికారులు మనసుతో ఆలోచిస్తే మంచిదన్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News