కరోనా చైనాలోని వూహాన్లో పుట్టిందని .. అక్కడి వైరాలజీ ల్యాబ్‌లో కాని జంతువిక్రయశాలలో కానీ ఈ వైరస్ పుట్టి ఉండొచ్చని ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాలు నమ్మాయి. శాస్త్రవేత్తలు, డాక్టర్లు, వివిధ దేశాధినేతలు సైతం ఇదే విషయాన్ని చెబుతూ వచ్చారు. అంతర్జాతీయ మీడియా సంస్థల్లో సైతం ఇందుకు సంబంధించిన వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుతం చైనా మాత్రం కరోనా వైరస్ వూహాన్లో పుట్టలేదని.. ఇటలీలోనే పుట్టిందని వాదిస్తున్నది. ఇందుకు సంబంధించిన ఆధారం ఇదేనంటూ ఓ అధ్యయనాన్ని కూడా బయటపెట్టింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ విషయం చర్చనీయాంశం అయ్యింది. డ్రాగన్ తనమీద పడ్డ నిందను తొలగించుకోవాలని చూస్తున్నది.
కరోనాకు పుట్టినిల్లు ఇటలీ అంటూ కొత్త వాదనను తెరమీదకు తెస్తున్నది. చైనా చెబుతున్న అధ్యయనం ఏం చెబుతుందంటే.. కరోనా వైరస్ ఇటలీలో పుట్టింది. అక్కడి నుంచే వుహాన్ సహా ఇతర దేశాలకు వ్యాపించింది. బీజింగ్‌లోని అధికారులు ఈ కొత్త అధ్యయన సూచనల ఆధారంగా సెప్టెంబర్ నెల ఆరంభంలోనే యూరోపియన్ నేషన్ లో కరోనా వైరస్ వ్యాప్తి మొదలై ఉండొచ్చునని అంటున్నారు. గతంలోనే మహమ్మారి మూలానికి సంబంధించి ఏసియన్ నేషన్ కూడా స్పెయిన్‌ను ప్రశ్నించింది. గత ఏడాదిలో అక్టోబర్‌లో మిలటరీ వరల్డ్ గేమ్స్ సమయంలో అమెరికా ఆర్మీ కూడా వుహాన్ సిటీలోనే కరోనా వ్యాప్తి ప్రారంభమైందని ఆరోపించింది. కానీ, చైనా రాష్ట్ర మీడియా మాత్రం ఇప్పుడు నేషనల్ కేన్సర్ ఇన్సిస్ట్యూట్ కొత్త అధ్యయనాన్ని చూపించి ఇదిగో సాక్ష్యమంటోంది.. కరోనా పుట్టింది చైనాలో కాదు.. ఇటలీలోనే ఇదిగో రుజువు అంటోంది. కరోనా వూహాన్‌లోనే పుట్టింది అనేందుకు ఇంతవరకు ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. దీంతో చైనా ఈ మొండి వాదనను తెరమీదకు తెస్తున్నది.
గతంలో ఓ సారి డబ్ల్యూహెచ్‌వో కూడా కరోనా పుట్టుకపై ఓ ఆసక్తికరమైన స్టేట్మెంట్ ఇచ్చింది. అదేంటంటే కరోనా వూహాన్ కంటే ముందే మరో చోట పుట్టిఉండొచ్చని డబ్ల్యూహెచ్‌వో పేర్కొన్నది. అయితే డబ్ల్యూహెచ్‌వో చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నదని.. చైనా జేబు సంస్థగా మారిందని గతంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆరోపించారు. డబ్ల్యూహెచ్‌వోకు అమెరికా నుంచి నిధులు కూడా ఆపేశారు. ఏదేమైనా చైనా తీసుకొచ్చిన ఈ కొత్తవాదన ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నది.