తన విదేశీ విధానంతో గతానికి భిన్నంగా వ్యవహరిస్తున్న ప్రధాని మోడీ పుణ్యమా అని భారత్ ఫారిన్ పాలసీలో చోటు చేసుకున్న మార్పులు చూస్తున్నదే. ఈ కారణంతోనే పలు దేశాలతో భారత్ సంబంధాలు గతానికి భిన్నంగా ఉంటున్నాయి. తన వరుస విదేశీ పర్యటనలతో పలు దేశాలతో స్నేహ హస్తాన్ని అందిస్తూ.. అందరిని కలుపుకుపోయేలా వ్యవహరిస్తున్న మోడీ.. అణు సరఫరా దేశాల కూటమిలో భారత్ ను భాగస్వామిని చేయాలని తపిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ కూటమిలో ఉన్న దేశాల్లో స్థానం సంపాదించేందుకు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు.
ఈ కూటమిలో స్థానం సంపాదిస్తే.. భారత్ కు జరిగే మేలు అంతాఇంతా కాదు. కానీ.. అదంత తేలికైన విషయం కాదు. ఎందుకంటే.. ఈ కూటమిలో ఉన్న 48 దేశాల్లో ఏ ఒక్క దేశం వ్యతిరేకించినా.. కొత్తగా స్థానం కోసం పోటీపడే దేశానికి చోటు లభించదు. ఇప్పటికే పలు దేశాలతో జరిపిన చర్చలతో భారత్ కు పెద్ద ఎత్తున మద్దతు లభిస్తున్నా.. పొరుగున ఉండే చైనా మాత్రం ససేమిరా అంటోంది.
ఎన్ ఎస్ జీలో భారత్ కు సభ్యత్వం కానీ ఖరారైతే అది చైనా ప్రయోజనాలకు దెబ్బ తగలటంతో పాటు.. చైనా అధిక్యానికి సవాలుగా మారే వీలుంది. అందుకే.. ఈ కూటమిలో భారత్ కు చోటు లభించకుండా ఉండేందుకు చైనా విపరీతంగా కసరత్తు చేస్తోంది. ఇప్పటికే 42 దేశాల మద్దతు పొందిన భారత్.. చైనాతో సహా మరో ఐదు దేశాలు సైతం భారత్ ఎంట్రీకి నో అనేస్తున్నాయి.
భారత్ కు వ్యతిరేకంగా నిలుస్తున్న దేశాల్లో చైనాతో పాటు.. న్యూజిలాండ్.. ఐర్లాండ్.. టర్కీ.. దక్షిణాఫ్రికా.. ఆస్ట్రియాలు ఉన్నాయి. ఈ దేశాలను ఒప్పించేలా ప్రయత్నిస్తున్న మోడీ సర్కారు ఎంతమేర విజయం సాధిస్తుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. అమెరికా మద్దుతుతో మిగిలిన ఐదు దేశాల అంగీకారాన్ని పొందినా.. చైనా మైండ్ సెట్ మార్చటమే అసలు సమస్యగా మారనుంది. చైనా మనసు మార్చాలంటే భారత్ పెద్ద త్యాగాన్నే చేయాల్సి ఉంది. భారత్ సభ్యత్వానికి అమెరికా మద్దతు ఇస్తుంటే.. భారత్ కు కూటమిలో ఎంట్రీ ఇస్తే పాక్ కు సైతం ఎంట్రీ ఇవ్వాలంటూ చైనా వాదిస్తోంది. చూస్తూ.. చూస్తూ.. పాక్ ను భారత్ అంగీకరించే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో భారత్ కు చైనా మద్దతు ఇవ్వటం సందేహమేనని చెప్పక తప్పదు.