ఒకవేళ యుద్ధం వస్తే పాకిస్తాన్, చైనా నుంచి భారత్ కాచుకోగలదా? మన దగ్గర ఎన్ని అణ్వాయుధాలున్నాయి? పొరుగుదేశాలు పాకిస్తాన్, చైనా దగ్గర ఎన్ని ఉన్నాయి? మనం శత్రుదేశాలను తట్టుకోగలమా? అన్న సందేహాలు అందరిలోనూ ఉన్నాయి. దీనిపై రీసెర్చ్ చేసిన స్వీడన్ కు చెందిన ‘ది స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ ’ సంచలన విషయాన్ని వెల్లడించింది. చైనా, పాకిస్తాన్ దేశాల దగ్గర భారతదేశం కంటే ఎక్కువగా అణ్వాయుధాలున్నాయని బాంబు పేల్చింది. ప్రస్తుతం భారత్-చైనా మధ్య వివాదం నెలకొన్న నేపథ్యంలో ఈ వివరాలు బయటకు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
స్టాక్ హోమ్ రీసెర్చ్ లో చైనా, పాకిస్తాన్ ల దగ్గర భారత్ కంటే ఎక్కువగా అణ్వాయుధాలు ఉన్నట్లు తేలింది. ప్రస్తుత ప్రపంచంలో అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా, భారత్ , పాకిస్తాన్ , ఇజ్రాయిల్, ఉత్తరకొరియా దేశాల దగ్గర మాత్రమే అణ్వాయుధాలున్నాయి. జనవరి 2020 నాటికి ఈ దేశాలన్నింటి దగ్గర మొత్తం 13400 అణ్వాయుధాలు ఉన్నట్లు ఈ సంస్థ అంచనావేసింది.
ఇందులో చైనా దగ్గర 320 అణ్వాయుధాలు, పాకిస్తాన్ దగ్గర 160, భారత్ వద్ద 150 ఉన్నాయని స్టాక్ హోమ్ రీసెర్చ్ తెలిపింది. అత్యధికంగా రష్యా వద్ద 6375, అమెరికా వద్ద 5800 అణ్వాయుధాలు ఉన్నాయని పేర్కొంది. ప్రపంచంలో 90శాతం కన్నా ఎక్కువ అణ్వాయుధాలు కేవలం రష్యా, అమెరికా వద్దే ఉన్నాయని స్టాక్ హోమ్ తెలిపింది.
ఇక భారత్, పాకిస్తాన్ లు అణ్వాయుధ సమాచారాన్ని దాచిపెడుతున్నాయని స్టాక్ హోమ్ ఆరోపించింది. చైనా గతంలో కంటే ఎక్కువగా బలప్రదర్శన చేస్తోందని.. సైనిక వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల్లో అమెరికా, చైనా తర్వాత భారత్ మూడో స్థానంలో ఉందని తెలిపింది.