పాపం చేసినప్పుడు ఊరికే పోతుందా? ఉతికి ఆరేసి మరీ పోతుందన్న మాటకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుంది చైనా. తన దారుణ తీరుతో ప్రపంచాన్ని శవాల కుప్పగా మార్చేసి.. ప్రపంచ గమనాన్ని బటన్ నొక్కినట్లుగా ఆపేసిన కొవిడ్ కు జన్మస్థలి అయిన చైనాకు ఇప్పుడు ఆ ఉసురు కొడుతోంది. రహస్య ల్యాబ్ లో ప్రపంచ వినాశనాన్ని తయారు చేయటం ఒక ఎత్తు అయితే.. ప్రమాదకరమైన ప్రయోగంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన చైనాకు ప్రపంచం బదులు ఇవ్వాల్సి వచ్చింది. కోట్లాది ప్రాణాలు గాల్లో కలిసిపోతే.. వందల కోట్ల మంది దాని బారిన పడిన వైనం తెలిసిందే.
మొత్తంగా ఆధునిక మానవ చరిత్రలో విలువైన రెండు సంవత్సరాల కాలాన్ని పాడు చేసిన చైనాకు.. ఆ పాపం తగలకుండా పోతుందా? ప్రపంచాన్నికొవిడ్ వణికించిన వేళలో.. చైనాలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో తెలిసిందే. ఈ మహమ్మారి మనిషి అత్యాశతోనే పుట్టిందన్న విషయం చైనాకు తెలుసు కాబట్టి.. అప్పటికి దాన్ని అణిచివేయటంలో కఠినంగా వ్యవహరించారు. కానీ.. ఆ విషయం ప్రపంచ దేశాలకు అర్థమయ్యేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
రెండు ప్రపంచ యుద్ధాల్లో మరణించిన దాని కంటే ఎక్కువగా కరోనా మహమ్మారి కారణంగా మరణించారన్న విషయాన్ని మర్చిపోలేం. కానీ.. అధికారిక లెక్కల్లో ఈ తీవ్రత కనిపించదు.
ఎక్కడికక్కడ ప్రభుత్వాలు ప్రజలు పానిక్ కాకుండా ఉండటానికి వీలుగా కొవిడ్ మరణాల్ని తక్కువ చేసి చూపించటం తెలిసిందే.
ఇప్పుడు పాడు కరోనా గురించి ఎందుకన్న సందేహం కలగొచ్చు. ఇప్పుడు మాట్లాడుకోవాల్సిందే. ఎందుకంటే.. కరోనాకు పుట్టినిల్లు అయినచైనాలో మహమ్మారి ఇప్పుడు భారీగా విరుచుకుపడుతోంది. డ్రాగన్ దేశంలోని చాలా నగరాల్లో కొవిడ్ తీవ్రత అంతకంతకు ఎక్కువ అవుతోంది.దీంతో.. పలు నగరాల్లోని వీధులన్నీ నిర్మానుష్యమవుతున్నాయి. కరోనాను బలవంతంగా కట్టడి చేసే వ్యూహానికి ప్రాధాన్యత ఇచ్చిన చైనా ఇప్పుడు దానికి సంబంధించిన మూల్యాన్ని చెల్లించుకుంటోంది.
కొవిడ్ మరణాలపై చైనా సర్కారు నోరు మెదపనప్పటికి.. అక్కడి పరిస్థితుల్ని చూస్తే తీవ్రత ఎంతో ఇట్టే అర్థమైపోతుందని చెబుతున్నారు. నగరాల్లోని శ్మశాన వాటికల వద్ద రద్దీ పెరుగుతున్న వైనం చూస్తే.. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుందని చెబుతున్నారు. చైనా రాజధాని బీజింగ్.. చెంగ్డూ లాంటి నగరాల్లో శ్మశాన వాటికలు బిజీగా మారాయి.
గత మూడేళ్లుగా జీరో కొవిడ్ వ్యూహాన్ని అమలు చేసిన చైనా.. ఈ మధ్యనే ఆ ఆంక్షల్ని ఎత్తేస్తున్నట్లుగా పేర్కొన్నారు. దీంతో కొవిడ్ నిర్దారణ పరీక్షలు లేకపోవటంతో మహమ్మారి చైనాను చుట్టేసింది. దీంతో.. ఇప్పుడా దేశం కొవిడ్ తో వణుకుతోంది. ప్రపంచాన్ని వణికించిన పాపం చైనాకు ఊరికే పోదుగా? వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తున్నట్లుగా అక్కడి పరిస్థితులు ఉన్నట్లుగా చెబుతున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.