చైనా సంచలనం: భారత్ ను ఎదుర్కొనేందుకు సైనికులకు మార్షల్ ఆర్ట్స్ శిక్షణ

Update: 2020-06-28 15:30 GMT
చర్చలు సాగిస్తూనే చైనా తన భూభాగంలో భారత్ పై కుట్ర పన్నుతూనే ఉంది. సరిహద్దు వగంట భారీగా బలగాలు మోహరిస్తూ ఉద్రిక్తత పరిస్థితులకు కారణమవుతోంది. ఈ సమయంలో భారత సైనికులను ఎదుర్కొనేందుకు.. వారిపై దాడి చేసేందుకు సైనికులను బలంగా చేస్తోంది. ఈ నేపథ్యంలో వారికి మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ ఇస్తోంది. త‌మ బ‌ల‌గాల‌కు శిక్ష‌ణ ఇచ్చేందుకు టిబెట్ పీఠభూమికి 20 మంది మార్ష‌ల్ ఆర్ట్స్ నిపుణుల్ని పంపిస్తున్న‌ట్లు చైనా తెలిపింది.

ల‌ద్దాఖ్‌లోని గల్వాన్ లోయ‌లో జ‌రిగిన‌‌ ఘ‌ర్ష‌ణ‌ల్లో తమ సైనికులు పెద్ద సంఖ్యలో మృతి చెందడంతో చైనా జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. వాస్తవానికి1996లో కుదిరిన ఒప్పందం ప్ర‌కారం రెండు దేశాలు ఈ ప్రాంతాల్లో తుపాకులు, పేలుడు ప‌దార్థాలు ఉప‌యోగించ‌కూడ‌దు. ఈ క్రమంలో కేవలం ఘ‌ర్ష‌ణ‌ ఏర్పడుతోంది. భొరత సైనికులు ధృడంగా ఉన్నారు. దీన్ని గుర్తించిన చైనా మార్ష‌ల్ ఆర్ట్స్ నిపుణుల‌తో సైన్యానికి శిక్ష‌ణ‌ ఇప్పిస్తోంది.

ఎంబో ఫైట్ క్ల‌బ్‌కు చెందిన 20 మంది యోధుల‌ను టిబెట్ రాజ‌ధాని లాసాకు త‌ర‌లిస్తున్న‌ట్లు చైనా అధికారిక వార్తా సంస్థ సీసీటీవీ వెల్లడించింది. భారత్, చైనా దేశాల మధ్య గతంలో కుదిరిన ఒప్పందాల ప్రకారం.. గల్వాన్ లోయ ప్రాంతంలో సైనికులు తుపాకులు, ఇతర మారణాయుధాలను ఉపయోగించకూడదు. ఈ నేపథ్యంలోనే ఇరు దేశాల సైనికుల మధ్య తలెత్తిన ఘర్షణల్లో ఇనుప ముళ్ల గదలను, రాడ్డులను, కర్రలను ఉపయోగించినట్లు వార్తలు వచ్చాయి. ఈ పరిస్థితుల మధ్య చైనా తమ సైనికులకు కఠోర పరిస్థితులను తట్టుకునేలా తీవ్రమైన శిక్షణ ఇస్తోంది. భారత్ సైనికుల దాడిని తీవ్రంగా ఎదుర్కొనడానికి ఈ శిక్షణ ఇప్పిస్తున్నట్లు సమాచారం.
Tags:    

Similar News