డ్రాగన్ దెబ్బకు లబోదిబోమంటున్న బ్రిటన్

Update: 2022-10-19 04:04 GMT
డ్రాగన్ దెబ్బకు బ్రిటన్ లబోదిబోమంటోంది. బ్రిటన్ లో యుద్ధ విమానాలు నడిపి రిటైర్ అయిన పైలెట్లకు చైనా పెద్ద వలేవేసింది. యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు వాడిన అనుభవం ఉండి చాలామంది రిటైర్ అయిపోయుంటారు. అలాంటి వాళ్ళ బ్యాక్ గ్రౌండ్ ను డ్రాగన్ గూఢచారులు బాగా స్టడీ చేసి తమ ప్రభుత్వానికి నివేదిక పంపుతున్నారట. ఆ నివేదికల ఆధారంగా చైనా తమకు సూటవుతారని అనుకున్న వారిపై వెంటన వల విసురుతోంది.

ఈ విషయాన్ని బ్రిటన్ ప్రభుత్వం చాల ఆలస్యంగా తెలుసుకున్నది. అప్పటికే జరగాల్సిన అన్యాయం జరిగిపోయింది. ఎందుకంటే రాయల్ ఎయిర్ ఫోర్స్ విభాగంలో పనిచేసి రిటైర్ అయిన పైలెట్లలో సుమారు 40 మంది ఇప్పటికే చైనాకు వెళ్ళిపోయారు. రిటైర్ అయిన వాళ్ళకు చైనా అత్యధిక ఆఫర్లను ప్రతిపాదిస్తోంది. తము ఉద్యోగంలో ఉన్నపుడు జీత, బత్యాల రూపంలో అందనంత మొత్తాన్ని చైనా ఆఫర్ చేస్తుండటంతో సహజంగానే రిటైర్ అయిన పైలెట్లు ఆకర్షితులవుతున్నారు.

తమ సర్వీసులో చేరిన బ్రిటన్ పైలెట్లలో ఒక్కొక్కరికి చైనా ఏడాదికి 2.70 లక్షల డాలర్లను ఆఫర్ చేస్తోందట. అంటే మన కరెన్సీలో రు. 2.23 కోట్లు వస్తాయంటే ఎవరైనా కాదంటారు. వయసు రీత్యా రిటైర్ అయినప్పటికీ వాళ్ళంతా శారీరకంగా, మానసికంగా బాగా దృఢంగా ఉన్నవాళ్ళే. అందుకనే చైనా ఆఫర్ ను వెంటనే ఓకే చెప్పేసి బ్రిటన్ నుండి వెళ్ళిపోతున్నారు.

ఇంతకీ వీళ్ళంతా చైనాకు వెళ్ళి అక్కడ ఏమి చేస్తున్నారంటే చైనా పైలెట్లకు యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు నడపటంలో శిక్షణిస్తున్నారు. ఇంతింత భారీ ఆఫర్లు ఇస్తున్న తర్వాత వీళ్ళని కేవలం శిక్షణకు మాత్రమే ఉపయోగంచుకోదు కదా. శిక్షణతో పాటు బ్రిటన్ యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, మిస్సైల్ వ్యవస్థలను, మిలిటరీ రహస్యాలను కూడా తెలుసుకునే అవకాశాలున్నాయి.

ఈ కారణంగానే ఇపుడు బ్రిటన్ ప్రభుత్వం లబోదిబోమంటోంది. బ్రిటన్లో రిటైర్ అయిన వాళ్ళు చైనాలో పనిచేయకూడదని నిబందనలేమీ లేవు. అయితే తాము పనిచేసిన విభాగాలకు సంబందించిన రక్షణ విషయాలను ఇతరులతో పంచుకోకూడదనే నిబందన ఉంది. ఇపుడా నిబందనను ఉల్లంఘిస్తారేమోనని బ్రిటన్ ప్రభుత్వం గోలచేస్తోంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News