కరోనా కట్టడికి బయలుదేరిన చైనా

Update: 2020-03-15 05:31 GMT
చైనాలోని వూహాన్ లో పుట్టి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మరణ మృందంగం వినిపిస్తోన్న కరోనా వైరస్ ను చైనాదేశం కట్టడి చేసింది. ఒక్క నెలలోనే వూహాన్ లో లక్షమందికిపైగా వ్యాపించిన ఈ వ్యాధిని చైనా అధికారులు కఠినమైన చర్యలు చేపట్టి ఐసోలేషన్ చేసి వైరస్ ను అదుపు చేశారు. ఇప్పుడు వూహాన్ లో కొత్త కేసుల సంఖ్య చాలా తగ్గిపోయింది.

చైనా ఈ కరోనా వైరస్ ధాటికి ఎక్కువగా ప్రభావితమైనప్పటికీ మూతికి మాస్కులు - చేతికి గ్లౌసులు - క్రమం తప్పకుండా పరిశ్రుభత పాటిస్తూ శుభ్రపరచడం.. వైరస్ వ్యాపించే మార్గాలను మూసివేయడం.. రోగులకు మెరుగైన ఔషధాలను  ఇస్తూ చైనా ఈ మాయదారి రోగాన్ని కట్టడి చేసింది.

అయితే ఇప్పుడీ అంటువ్యాధి అయిన కరోనా బయట దేశాలకు పాకి ముఖ్యంగా ఇటలీ - ఇరాన్ - దక్షిణ కొరియా దేశాల్లో మరణ మృందంగం వాయిస్తోంది. అక్కడ ఇప్పటికే వందలాది మంది చనిపోయారు. ఇటలీలో అయితే ప్రజలందరిని ఇంట్లోంచి బయటకు రావద్దని గృహనిర్బంధంలో పడేశారు.

దీంతో తాము కట్టడి చేసిన కరోనా కారణంగా ఇటలీ - ఇరాన్ - కొరియా దేశాల్లో వందలాది మంది చనిపోవడంతో చైనా రంగంలోకి దిగింది. ఆ దేశాలకు సహాయ బృందాలను పంపుతోంది. అంతేకాదు.. తీవ్రత ఎక్కువగా ఉన్న ఇటలీకి దాదాపు అర మిలియన్ ఫేస్ మాస్క్ లను విరాళంగా ఇచ్చింది. తాజాగా చైనాలోని షాంఘై నసుంచి విమానం బయలు దేరి బెల్జియంలోకి చేరుకొని అక్కడి నుంచి ఇటలీకి బయలు దేరింది.

ఇటలీలో మరణాలు ఎక్కువగా జరుగుతుండడంతో చైనా ఆ దేశానికి 20 చైనా వైద్య బృందాలను టన్నుల కొద్దీ వైద్య సామగ్రిని పంపింది.  ఈ అంటువ్యాధి యూరోపియన్ దేశాలను అతలాకుతం చేస్తున్న నేపథ్యంలో చైనా ఇలా ముందుడుగు వేయడంపై ప్రపంచ దేశాలు హర్షం వ్యక్తం చేశాయి.


Tags:    

Similar News