ప్రపంచాన్ని ముంచేసి.. ఇప్పుడు మాస్కు లేకుండా తిరగమనటమా?

Update: 2020-08-21 17:00 GMT
ప్రపంచానికి నిద్ర లేకుండా చేసిన కరోనా ప్రస్తావన వచ్చినంతనే గుర్తుకు వచ్చేది డ్రాగన్ దేశమే. అక్కడ పుట్టిన వైరస్ వందల కోట్ల మందిని తిప్పలు పెట్టటమే కాదు.. లక్షల కోట్ల రూపాయిల నష్టాన్ని.. దాదాపు ఎనిమిది లక్షల మందిని అధికారికంగా.. అనధికారికంగా అంతకు మించే మరణాలు చోటు చేసుకున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీటికి సంబంధించి ఏ ప్రభుత్వాలు ఉన్నది ఉన్నట్లుగా సమాచారం ఇవ్వట్లేదన్న మాట బలంగా వినిపిస్తోంది. ఇప్పటికి.. రోజూ దగ్గర దగ్గర మూడు లక్షల కొత్త కేసులు ప్రపంచ వ్యాప్తంగా నమోదవుతున్నాయి.

కరోనా వ్యాక్సిన్ వస్తే తప్పించి.. ప్రపంచం కుదుటుపడని పరిస్థితి. ఏ దేశంలోనూ కరోనా కేసులు అని సంతోషపడిన వారం.. రెండు వారాల్లోనే కొత్త కేసులు వెలుగు చూస్తున్న పరిస్థితి. దీంతో.. ఎవరూ కూడా గతంలో మాదిరి మాస్కులు లేకుండా బయటకు రావటం.. చేతికి శానిటైజర్ పూసుకోకుండా ఉండటం లాంటివి చేయలేకపోతున్నారు. ఎవరికి వారు జాగ్రత్తగా ఉంటూ భయం భయంగా బతికేస్తున్నారు.

ఇలాంటివేళలో.. ఈ మహమ్మారికి కేరాఫ్ అడ్రస్ అయిన చైనాలో.. అక్కడి ప్రభుత్వం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. చైనా రాజధాని బీజింగ్ లో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు.. ఇకపై ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు లేకుండా ప్రజలు తిరగొచ్చని స్పష్టం చేసింది. ఇప్పటివరకుప్రజలు ఎవరూ మాస్కులు లేకుండా ఇంట్లో నుంచి బయటకు రాకూడదని చెప్పిన వారే. ఇప్పుడు అందుకు భిన్నంగా వచ్చేయొచ్చని చెప్పటం ఆసక్తికరంగా మారింది.

గడిచిన పదమూడు రోజులుగా ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాని నేపథ్యంలో బీజింగ్ లోని ప్రజలు బయటకు వెళ్లే టప్పుడు ఎలాంటి మాస్కులు ధరించాల్సిన అవసరం లేదని తేల్చేసింది. బీజింగ్ వైద్య ఆరోగ్య శాఖ తీసుకున్న నిర్ణయంపై ప్రపంచ వ్యాప్తంగా విస్మయం వ్యక్తమవుతోంది. ఓపక్క కరోనా భయంతో మాస్కులు లేకుండా బయటకు రావటాన్ని తప్పు పడుతుంటే.. అందుకు భిన్నంగా బీజింగ్ అధికారుల ప్రకటన ఉలిక్కిపడేలా చేయటమే కాదు.. ప్రపంచాన్ని ముంచాల్సినంత ముంచేసి.. ఇలాంటి నిర్ణయం తీసుకోవటమా? అన్న ప్రశ్న పలువురి నోట వినిపిస్తోంది.




Tags:    

Similar News