వ్యాపారం అన్నాక ఆకర్షణీయమైన ఆఫర్లు మామూలే. పెరిగిన పోటీ నేపథ్యంలో వినూత్నంగా ఉండే ఆఫర్లు ఇచ్చి వినియోగదారుల్ని ఆకర్షించటం మామూలే. అయితే.. చైనాలోని ఒక కంపెనీ ప్రకటించిన ఆఫర్ లాంటిది మాత్రం కష్టమేనంటున్నారు. ఆఫర్ వింటేనే ఆశ్చర్యపోయే విధంగా ఉన్న ఈ ఆఫర్ ఇప్పుడు చైనాలోనే కాదు.. పలుదేశాల్లోనూ చర్చనీయాంశంగా మారింది.
ఇంతకీ ఈ చిత్రమైన ఆఫర్ ఏమిటంటే.. చైనాకు చెందిన ఒక మ్యార్టిమోనీ కంపెనీ.. తాను కుదర్చిన పెళ్లిళ్లకు సంబంధించి ఒక ప్రకటన చేసింది. తాను కుదిర్చిన పెళ్లి కానీ పెడాకులై.. విడాకులకు వెళితే.. తర్వాత సదరు వధువు.. వరుడులకు మరో పెళ్లి బాధ్యత తామే తీసుకుంటామని పేర్కొంటోంది. ఇక్కడితో ఆఫర్ ముగిస్తే మాట్లాడాల్సిన అవసరం ఉండేది కాదు. ఇక్కడే బంఫర్ ఆఫర్ ప్రకటించింది. సదరు వివాహానికి అయ్యే ఖర్చు మొత్తం కూడా తానే భరిస్తానని చెబుతోంది.
శుభమా అని పెళ్లి చేస్తామనాల్సిన పెళ్లిళ్ల బ్రోకర్ కంపెనీ.. పెళ్లికి ముందే విడాకులు.. మళ్లీ జరిగే పెళ్లి గురించి మాట్లాడటం ఏమిటని బుగ్గలు నొక్కుకుంటున్నారు. వ్యాపారం అన్నాక దూరదృష్టి ఉండాలన్న మాటకు తగ్గట్లే పెళ్లిళ్ల విషయంలోనూ ఇదే సూత్రమా అని బుగ్గలు నొక్కుకుంటున్నారు.