బ్రేకింగ్... సంధ్య థియేటర్ ఘటనపై పోలీసులు సీరియస్ వార్నింగ్!
అవును... సంధ్య థియేటర్ కేసును హైదరాబాద్ పోలీసులు సీరియస్ గా తీసుకున్నారనే కామెంట్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
సంధ్య థియేటర్ లో తొక్కిసలాట ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందడం, ఆమె కుమారుడు తీవ్ర అనారోగ్య పరిస్థితుల మధ్య సుమారు మూడు వారాలుగా ఆస్పత్రిలో చికిత్స పోందుతుండటం తెలిసిందే. ఈ సమయంలో పలు గాసిప్ లు ప్రచారంలోకి వచ్చాయని అంటున్నారు. దీంతో.. పోలీసులు సీరియస్ గా స్పందించారు.
అవును... సంధ్య థియేటర్ కేసును హైదరాబాద్ పోలీసులు సీరియస్ గా తీసుకున్నారనే కామెంట్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించిన కేసును వారు ఎంతో నిబద్ధతగా దర్యాప్తు చేస్తున్నారని అంటున్నారు. ఈ సమయంలో... హైదరాబాద్ సిటీ పోలీసులు ఈ విషయంపై అందరికీ స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారు.
ఇందులో భాగంగా... సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఎవరైనా సోషల్ మీడియా వేదికగా తప్పుడు సమాచారం, వీడియోలు పోస్ట్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హైదరబాద్ సిటీ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ ఘటనపై విచారణలో తేలిన వాస్తవాలను పోలీస్ శాఖ ఇప్పటికే వీడియో రూపంలో ప్రజల ముందు ఉంచిందని అన్నారు.
ఈ సమయంలో వాస్తవాలను వక్రీకరించేలా.. ప్రజలను తప్పుదోవ పట్టించేలా పోస్టులు పెడితే సీరియస్ యాక్షన్ ఉంటుందని అన్నారు. అల్లు అర్జున్ రాకముందే తొక్కిసలాట జరిగిందంటూ కొంతమంది సోషల్ మీడియా వేదికగా తప్పుడు పోస్టులు పెడుతున్నారనే విషయం తమ దృష్టికి వచ్చిందని వెల్లడించారు.
ఇలా... అల్లు అర్జున్ రాకముందే తొక్కిసలాట జరిగిందని.. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు రూపొందించిన వీడియోలను కొంతమంది ఉద్దేశ్యపూర్వకంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారనే విషయాలు తమ దృష్టికి వచ్చాయని.. ఓ పక్క కేసు విచారణలో ఉండగా మరోపక్క ఉలా ఉద్దేశ్యపూర్వకంగా ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసే వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఇలాంటి ప్రచారాలను పోలీసు శాఖ పరువు తీసే అసత్య ప్రచారాలుగా పరిగణలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా... అమాయక మహిళ మరణానికి, ఓ చిన్నారి ప్రాణాపాయ స్థితిలో ఉండటానికి కారణమైన ఈ కేసును పోలీసు శాఖ ఎంతో నిబద్ధతతో దర్యాప్తు చేస్తోందని వెల్లడించారు.
దీనిని ప్రశ్నించేందుకు ఎవరైనా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు, కట్టుకథలు ప్రచారం చేస్తే సహించేది లేదని వెళ్లడించారు. అయితే... ఈ ఘటనకు సంబంధించి సాక్ష్యం కానీ, అదనపు సమాచారం కానీ ఉంటే దాన్ని ఏ పౌరుడైనా పోలీసు శాఖకు అందించవచ్చని.. అయితే, వ్యక్తిగత వ్యాఖ్యల్లు మాత్రం చేయొద్దని స్పష్టం చేశారు.
ఇదే సమయంలో... సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నట్లు పోలీసు శాఖ వెల్లడించింది!