భారత్ కు భయపడి చైనా సైనికులు ఏడవలేదట!!

Update: 2020-09-26 02:30 GMT
కొంతకాలంగా భారత్, చైనా ల మధ్య ఉద్రిక్త వాతావరణం ఏర్పడిన సంగతి తెలిసిందే. ప్యాంగ్యాంగ్ వద్ద తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణ జరగడం...ఈ క్రమంలో 20 మంది భారత సైనికులు అమరులవ్వడం తీవ్ర కలకలం రేపింది. ఆ ఘర్షణలో 40 మందికి పైగా చైనా సైనికులు మరణించినట్టు ప్రచారం జరిగింది. అయినా బుద్ధి మారని చైనా... ఆ తర్వాత లడాఖ్, లేహ్ వద్ద కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. అయితే, చైనా సైన్యానికి భారత్ సైన్యం దీటుగా జవాబిస్తోంది. ఈ క్రమంలోనే లడఖ్ సరిహద్దులకు బస్సులో బయల్దేరిన చైనా సైనికుల ఏడుపు వీడియో ఈ మధ్య కాలంలో వైరల్ అయింది. భారత సైన్యానికి భయపడి వారంతా కన్నీళ్లు పెట్టుకున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఆ వీడియో ఆధారంగా తైవాన్‌కు చెందిన మీడియా సంస్థలు.. చైనాకు వ్యతిరేకంగా వార్తలను ప్రచారం చేశాయి.

అయితే, ఆ వీడియోలో తమ సైనికులు కుటుంబాన్ని విడిచి వెళుతున్నామని భావోద్వేగంతో, దేశభక్తితో ఏడుస్తున్నారని చైనా చెబుతోంది. చైనా సైనికులంతా ‘గ్రీన్ ఫ్లవర్స్ ఇన్ ది ఆర్మీ’ అని పాడుతూ భావోద్వేగానికి గురయ్యారని అంటోంది.తైవాన్‌లో జరుగుతున్న ఏడుపు ప్రచారాన్ని చైనా తోసిపుచ్చింది. భారత జవాన్లకు భయపడి తమ సైనికులు ఏడవడం లేదని చైనా మీడియా చెబుతోంది. మరి, చైనా మీడియా చెప్పినట్టు వారు భావోద్వేగంతో ఏడుస్తున్నారా...లేక భయపడుతూ ఏడుస్తున్నారా...అన్నది స్పష్టం కాలేదు. దీంతో, సోషల్ మీడియాలో ఉన్న వీడియోకు సంబంధించిన ఏడుపు రియల్ ఆర్ వైరల్ అన్నది తేలాల్సి ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Full View
Tags:    

Similar News