అమెరికా అధ్యక్ష ఎన్నికలలో గెలుపెవరిదన్న విషయంలో ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో అంచనాలు - ఇంకెన్నో ఊహాగానాలు... అసలు అక్కడ ఎన్నికల విధానమేంటో తెలియనివారు కూడా చేస్తున్న విశ్లేషణలు.. ఎక్కడ చూసినా ఇదే ముచ్చట. ఏదో ఏపీలోనో.. ఇండియాలో ఎన్నికలు జరుగుతున్నంతగా ''ఇంతకీ ఎవరు గెలుస్తారంటావ్" అంటూ ఒకరికొకరు ప్రశ్నలు వేసుకోవడాలు. అందుకు తగ్గట్లుగానే అమెరికాలోని పోల్ ట్రాకర్ల అంచనాల్లోనూ ఫ్లక్చుయేషన్స్.. ఒకరోజు ట్రంప్ ది ఆధిపత్యమంటే మరో రోజు హిల్లరీయే కింగని లెక్కలు. ఇలా.. అమెరికా అధ్యక్ష ఎన్నికలను ప్రపంచమంతా పులిమేశారు. ఈ నేపథ్యంలో తెరపైకి జ్యోష్యాలూ వస్తున్నాయి. పండితుల జ్యోష్యాలే కాదు పశుపక్ష్యాదుల జ్యోష్యాలూ పాపులర్ అవుతున్నాయి. తాజాగా చైనాకు చెందిన ఒక కోతి అమెరికా ఎన్నికల్లో గెలుపెవరిదో చెప్పేసింది. అదేంటి కోతి చెబితే నమ్మేస్తారా అనుకోవద్దు... దాని ట్రాక్ రికార్డు అలాంటిది మరి. అది చెప్పిందంటే దానికి తిరుగు ఉండదంటున్నారు చైనీయులు. మరి దాని గెస్ కరెక్టవుతుందో లేదో చూడాలి.
చైనాకు చెందిన ఆ కోతి పేరు గెడా. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన సాకర్ యూరోపియన్ చాంపియన్ షిప్ ఫైనల్ లో గెలిచే జట్టు ఏదన్నది కరెక్టుగా చెప్పేసింది. గెడా ముందు హిల్లరీ క్లింటన్ - డోనాల్డ్ ట్రంప్ ల భారీ కటౌట్లను ఉంచి రెంటిలో ఏదో ఒక దానిని పట్టుకోవాలని కోరగానే అది క్షణం ఆలస్యం చేయకుండా డోనాల్డ్ ట్రంప్ కటౌట్ ను టచ్ చేసిందట.
కాగా ఫుల్ డిమాండ్ ఉన్న ఈ కోతి గ్జియాంగ్జు ఎకలాజికల్ పార్క్ లో ఉంటోంది. ప్రపంచమంతా అమెరికా అధ్యక్ష ఎన్నికలపై అంచనాలు వేసుకుంటుండడంతో అక్కడున్న వారు ఇదేం చెబుతుందో తెలుసుకోవాలనుకున్నారు. అందులోనూ గతమంతా ఘన చరిత ఉండడంతో దాని మాట నిజమవుతుందంటున్నారు పార్కు సిబ్బంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/