చంద్రుడ్ని క‌బ్జా చేసేస్తున్న చైనా?

Update: 2019-01-17 07:40 GMT
మ‌న‌మేమో ఒకేసారి పాతిక‌.. యాభై.. వంద ఉప‌గ్ర‌హాల్ని పంపుతున్నామ‌న్న గొప్ప‌లు చెప్పుకుంటున్న వేళ‌.. పొరుగున ఉన్న చైనావోడు మాత్రం ప్ర‌పంచంలో మ‌రే దేశం సాధించ‌ని విజ‌యాన్ని సొంతం చేసుకుంటున్నాడు. ఇటీవ‌ల కాలంలో తాను చంద్రుడి మీద గురి పెట్టిన చైనా.. వ‌రుస విజ‌యాల్ని న‌మోదు చేస్తోంది.

మొన్నీ మ‌ధ్య‌నే చంద్రుడికి రెండో వైపున‌కు వెళ్లేందుకు చాంగే4 అనే వ్యోమ నౌక‌ను పంపిన డ్రాగ‌న్ దేశం.. తాజాగా మ‌రో ఘ‌న‌త‌ను సాధించి. అగ్ర‌రాజ్య‌మైన అమెరికా సైతం చేయ‌ని ప‌నిని చేసి.. చంద్రుడిపై త‌న అధిప‌త్యాన్ని  ప్ర‌ద‌ర్శిస్తుండ‌టం విశేషం.

చంద్రుడిపై మొక్క‌ను పెంచ‌టం ద్వారా.. మ‌నిషి జీవ‌నానికి అనుకూలంగా త‌యారు చేయాల‌న్న త‌ప‌న ఏళ్ల నుంచి ఉంది. ఇందులో భాగంగా.. విత్త‌నాల‌తో ఒక మొక్క‌ను మెలకెత్తేలా చేయ‌టంలో చైనా స‌క్సెస్ అయ్యింది. ఈ విష‌యాన్ని తాజాగా వెల్ల‌డించింది. చాంగే 4 వ్యోమ‌నౌక‌లో ఒక చిన్న కంటైన‌ర్ ఉంచారు. అందులో మ‌ట్టిని నింపి.. ప‌త్తి.. బంగాళ‌దుంప విత్త‌నాల్ని ఉంచారు.

కృత్రిమ ప‌ద్ద‌తిలో చంద్రుడి వాతావ‌ర‌ణంలో  విత్త‌నాలు విత్తేలా చేయ‌టంలో విజ‌యం సాధించిన‌ట్లుగా చైనా పేర్కొంది. త‌క్కువ గురుత్వాక‌ర్ష‌ణ ఉండే చంద్రుడిలో మొక్క‌ల ఎదుగుద‌ల‌ను ప‌రీక్షించ‌టం ఈ ప‌రిశోధ‌న ల‌క్ష్యం. అందులో మొద‌టి అడుగును చైనా విజ‌య‌వంతంగా పూర్తి చేసింద‌ని చెప్పాలి.
Tags:    

Similar News