కొత్త ఏడాదిలో చంద్రుడి పై చైనా అద్భుతం

Update: 2018-12-31 08:53 GMT
అంతరిక్ష  ప్రయోగాల్లో చైనా మరో ముందడుగు వేసింది. ఇటీవల చైనా ప్రయోగించిన అంతరిక్ష నౌక- ’చేంజ్’ చంద్రుడి కక్ష్యలోకి అడుగుపెట్టింది. ఈ నౌక ఇప్పటి వరకు ఎవరికీ కనిపించని ‘డార్క్ సైడ్’ లో అడుగుపెట్టనుంది.

బీజీంగ్ కాలమాన ప్రకారం ఈ తెల్లవారుజామున ఈ అంతరిక్ష నౌక చంద్రుడి ఉపరితలానికి సుమారు 15కిలో మీటర్ల దూరంలో కక్ష్యకు చేరుకుందని చైనా శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఈ నౌక చంద్రుడిపై భూభాగం, అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు శాస్త్రవేత్తలకు సమాచారం అందిస్తోంది. అలాగే అక్కడి ఖనిజాలు, న్యూట్రన్ రేడియేషన్, న్యూట్రన్ యాటమ్స్ వంటి వాటి విశేషాలను ఈ నౌక అధ్యయనం చేయనుంది.

2030 నాటికి అంతరిక్ష్యం పై అమెరికా, రష్యా దేశాలతో సమానంగా తాము సాధించాడమే లక్ష్యమని చైనా ప్రకటించిది. కాగా కొత్త ఏడాదిలో చైనా సొంత మానవ సహిత స్పేస్ స్టేషన్ ను ఏర్పాటు చేయాలని కూడా యోచిస్తుందని సిన్ హువా అనే వార్త సంస్థ ఓ తెలిపింది. కాగా ఇటీవలే చైనా అతిపొడవైన ‘మార్ట్ 3’ రాకెట్ ప్రయోగించిది. తాజా ‘చేంజ్-4’తో చైనా చంద్రుడిపై మరో ముందుడుగు వేసినట్లయింది.





Full View
Tags:    

Similar News