డోక్లాం... భారత్-చైనా- టిబెట్ ల మధ్య ఉన్న ప్రాంతం. ప్రపంచ పటం మీద సూదిమొన మోపేంత భూభాగం కూడా కాదు. భూటాన్‌కు చెందిన ఆ చిన్న భూమి చెక్కమీద చైనా రోడ్డు వేసే నెపంతో కాలు మోపింది. భూటాన్ తో రక్షణ ఒప్పందం కలిగిన భారత్ అడ్డువెళ్లింది. 73 రోజులపాటు తీవ్ర ఉత్కంఠ. రెండు ఆసియా దిగ్గజాల మధ్య యుద్ధం తప్పదా? అనేంతవరకు వెళ్లింది. చివరకు ఉభయపక్షాలు వెనుకకు తగ్గడంతో ఉద్రిక్తతలకు తెరపడింది. బ్రిక్స్ సదస్సు సందర్భంగా భారత్-చైనా భాయ్ భాయ్ కరచాలనాలతో డోక్లాం సమస్యకు తెరపడింది. అయితే సమస్య పరిష్కారం ఎలా జరిగిందీ వివరాలు పెద్దగా బయటకు రాలేదు. కానీ సద్దుమణిగింది. అయితే, మళ్లీ ఇదే అంశం తెరమీదకు వచ్చింది. అయితే ఈ దఫా భారత్ పరువుపోయే పరిణామం చోటుచేసుకుంది. ఈ విషయాన్ని అమెరికా వెల్లడించింది.
అమెరికాకు చెందిన ఓ అధికారి ఈ కీలక, సున్నితమైన ప్రాంతం గురించి హెచ్చరికలు చేశారు. వివాదాస్పద డోక్లాం ప్రాంతంలో చైనా సైలెంట్ గా తమ కార్యకలాపాలను మళ్లీ మొదలుపెట్టిందని అమెరికా విదేశాంగ శాఖ సీనియర్ అధికారి అలిస్ వెల్స్ వెల్లడించారు. అయినా ఇండియా - భూటాన్ ఈ విషయాన్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. ఇండియా సరిహద్దులో చైనా రోడ్డు నిర్మాణాలు ఎక్కువ చేస్తుండటంపై స్పందిస్తూ ఆయన భారత్ కు హెచ్చరికలు జారీ చేశారు. ``ఇండియా తన ఉత్తర సరిహద్దులను బాగు చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది కచ్చితంగా ఆ దేశానికి ఆందోళన కలిగించేదే`` అని అన్నారు. ``హిమాలయాల్లో భూభాగాల కోసం ఇండియా-చైనా మధ్య చాలాసార్లు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈమధ్యే ఇండియా-చైనా-భూటాన్ మధ్య ఉన్న వివాదాస్పద డోక్లాం ప్రాంతంలో రెండు దేశాల సైన్యం రెండున్నర నెలలపాటు మాటు వేసింది. రెండు దేశాలు అప్పుడు వెనక్కి వెళ్లిపోయినా చైనా సైలెంట్ గా తమ కార్యకలాపాలను మళ్లీ మొదలుపెట్టింది. అయినా ఇండియా-భూటాన్ మాత్రం పట్టించుకోవడం లేదు. దక్షిణ చైనా సముద్రంలో ఎలా వ్యవహరిస్తుందో హిమాలయాల్లోనూ చైనా అలాగే వ్యవహరిస్తోంది`` అని వెల్స్ వ్యాఖ్యానించారు.
కాగా, దక్షిణ చైనా సముద్రంలో అమెరికా కార్యకలాపాలపై ప్రశ్నించగా వెల్స్ ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.దక్షిణ చైనా సముద్రంపై తమకూ హక్కు ఉన్నదని వియత్నాం-మలేషియా-ఫిలిప్పీన్స్-బ్రూనై-తైవాన్ లాంటి దేశాలు వాదిస్తున్నా చైనా మాత్రం తన పని తాను చేసుకుపోతోంది. ఇక్కడ తమ సైన్యాన్ని - క్షిపణి వ్యవస్థను కూడా మోహరించింది. ఇటు దక్షిణ చైనా సముద్రం - అటు తూర్పు చైనా సముద్రాలు పుష్కలమైన ఖనిజాలకు కేరాఫ్. అలాంటి సముద్రాలపై చైనా పూర్తి హక్కులు తమవేనని చైనా వాదిస్తోంది`` అని ఆయన అన్నారు. ఈ సందర్భంగా హిమాలయన్ రేంజ్ లో చైనా చేస్తున్న పనుల గురించి ఆయన చెప్పారు. ఇండియా సరిహద్దులో ఉన్న డోక్లాం విషయంలోనూ చైనా ఇలాగే వ్యవహరిస్తోందని తెలిపారు. గతంలె 73 రోజుల ఉద్రిక్తతల తర్వాత మళ్లీ వెనుకడుగు వేసినప్పటికీ ఇప్పుడు మరోసారి అక్కడ తన కార్యకలాపాలను ప్రారంభించిందన్నారు.