గాల్వన్​ ఘర్షణపై చైనా వీడియో... తప్పంతా భారత్​దేనట..!

Update: 2021-02-20 04:08 GMT
గత ఏడాది లడఖ్​ సరిహద్దుల్లోని గాల్వన్​ లోయ ప్రాంతంలో భారత్​.. చైనా సైనికులు పరస్పరం తలపడ్డ విషయం తెలిసిందే. ఈ ఘటనలో మొత్తం 20 మంది భారత సైనికులు చనిపోయారు. అయితే చైనా మాత్రం తమ సైనికులు ఎంత మంది చనిపోయారో చాలా కాలం వరకు వివరాలు తెలియజేయలేదు. తాజాగా ఐదుగురు చనిపోయినట్టు ప్రకటించింది. వారికి పురస్కారాలు కూడా అందజేసింది. అయితే గాల్వన్​ ఘటనపై ఓ వీడియో విడుదల చేసి .. భారత్​ సైనికులే తమ భూభాగంలోకి చొచ్చుకొచ్చినట్టు తెలిపింది.  ఈ మేరకు ఇవాళ చైనా అధికార మీడియా ఓ వీడియోను విడుదల చేసింది..

గాల్వన్​ దగ్గర ఘర్షణలో భారత సైనికులే చైనా భూభాగంలోకి చొచ్చుకొచ్చారని బుకాయించే ప్రయత్నం చేసింది చైనా..  తూర్పు లడాఖ్‌ గాల్వన్​లోయలో జరిగిన ఘర్షణలో ఐదుగురు మిలిటరీ ఆఫీసర్లు, సైనికులు ఇప్పటికే చైనా తెలిపింది. షిన్‌జియాంగ్‌ మిలిటరీ కమాండర్‌ కీ ఫబావో, చెన్‌ హోంగ్జన్‌, చెన్‌ షియాన్‌గ్రాంగ్‌, షియాలో సియువాన్‌, వాంగ్‌ జురాన్‌ మృతిచెందారని పేర్కొంది. వీరికి గౌరవ హోదాలు కల్పించినట్లు తెలిపింది. దీనిపై సెంట్రల్‌ మిలిటరీ కమిషన్‌ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసిందని స్థానిక మీడియా వెల్లడించింది.

అయితే తమ సైనికులు ఎంత మంది చనిపోయారో చెప్పకుండా ఐదుగురు మృతిచెందారని ఆలస్యంగా ఒప్పుకున్న చైనా తాజాగా విడుదల చేసిన వీడియోలో భారత సైనికులదే తప్పు అన్నట్టు వీడియోను విడుదల చేయడం గమనార్హం.
Tags:    

Similar News