ఆమె పేరు యున్ సన్. ఇదెక్కడి పేరండి? ఆమె ఏమైనా ప్రముఖురాలా? అంటే.. అవునని చెప్పాలి. కానీ.. భారతీయులకు ఆమె అంత సుపరిచితం కాదు. కానీ.. చైనాలో ఆమెకు ఉండే పట్టు ఉంది. ఇంతకీ ఆమె చేస్తుంటారంటారా? అక్కడికే వస్తున్నాం. చైనా వ్యవహారాల నిపుణురాలు.. అమెరికాలోని స్టిమ్సన్ సెంటర్ లో ఈస్ట్ ఆసియా ప్రోగ్రాం సహ డైరెక్టర్.
ప్రస్తుతం భారత్ - చైనాకు మధ్య చోటు చేసుకున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఆమెను ఒక ఇంగ్లిషు మీడియా సంస్థ ఇంటర్వ్యూ చేసింది. దీని ప్రత్యేకత ఏమంటే.. చైనాకు సంబంధించి అధికారిక పూర్వకంగా ఇంటర్వ్యూలు ఇవ్వటం చాలా అరుదు. తాజాగా ఆమె అలాంటి పని చేశారు. తన ఇంటర్వ్యూలో భాగంగా చైనా మైండ్ సెట్ తో పాటు.. భారత్ విషయంలో ఆ దేశం.. ఆ దేశస్తులు ఏమనుకుంటున్నారన్న విషయంపై అవగాహన పెంచేలా ఆమె ఇంటర్వ్యూ సాగింది.
ఇంతకీ ఆమె ఏం చెప్పారు? ఎలాంటి వ్యాఖ్యలు చేశారు? అన్న విషయంలోకి వెళితే..
% 2017లో డోక్లాం వివాదం చైనాను ఆశ్చర్యానికి గురి చేసింది. భారత్ తనను వ్యతిరేకిస్తుందని.. దగ్గరదగ్గర ఆరేడు వారాల పాటు వివాదం నడుస్తుందని అస్సలు అనుకోలేదు. అప్పటి నుంచే చైనా వ్యూహాల్లో మార్పువచ్చింది. భారత్ తో పరస్పర చర్చలు జరపటానికి ముందుకురావటం అందులో భాగమే.
% భూటాన్ కు సమీపంలోని బంజరు భూమి కోసం భారత్ తనను వ్యతిరేకిస్తుందని చైనా అస్సలు భావించలేదు. ఒక రకంగా డోక్లాం ఉదంతం ఛైనాకు షాక్ లాంటిదే.
% తాజా వివాదానికి సంబంధించి సరిహద్దు సమీపంలో భారతదేశ కార్యకలాపాలపై స్పందించాలని చైనా అనుకుంటోంది. వాస్తవ నియంత్రణ రేఖ దగ్గర భారతదేశ చర్యలు మాకు అంగీకారం కాదని అధికారులు చెబుతున్నారు. అందుకే అలాంటివాటిపై చైనా స్పందిస్తోంది.
% ప్రస్తుతం వివాదం నడుస్తున్న ఎల్ ఏసీ వెంబడి ఉన్న ప్రదేశాల గురించి.. ఎన్నో ఏళ్లుగా వివాదం సాగుతోంది. భారతదేశం చర్యలు మాకు అంగీకారం కాదు.
% భారతదేశం తమను వెన్నుపోటు పొడిచిందని చైనీయులు భావించారు. ప్రస్తుతం భారతదేశం చైనాను ఒక అసాధారణ స్థితిలోకి పెడుతోంది. ఇలాంటప్పుడు చైనా ముందున్నవి రెండు మార్గాలు. ఒకటి..చైనా దూకుడుగా స్పందించి భారత్ మీద దాడి చేయటం. రెండోది.. అలాంటిదేమీ లేకుండా ఏమీ చేయకుండా భూభాగాన్ని వదులుకోవటం.