టెక్నాలజీని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవటం చాలా అవసరం. ఈ విషయంలో అగ్రదేశాలకు భిన్నంగా వ్యవహరిస్తోంది చైనా. టెక్నాలజీని అంది పుచ్చుకోవం.. అత్యాధునిక సాంకేతికతను డెవలప్ చేయటం పై ఆ దేశం ప్రత్యేక ఆసక్తిని ప్రదర్శిస్తుందని చెప్పాలి. ప్రపంచం లో చాలా కొద్ది దేశాల్లో మాత్రమే 5జీ నెట్ వర్క్ ఉంది. అత్యధిక దేశాలు 5జీ టెక్నాలజీని అంది పుచ్చుకోవటానికి మరికొన్ని ఏళ్లు పట్టే పరిస్థితి.
ఇలాంటివేళ.. అప్పుడే 6జీ నెట్ వర్క్ మీద పరిశోధనలు చేయటం షురూ చేసింది చైనా. వేగ వంతమైన మొబైల్ డేటాను అందించేందుకు వీలుగా ఎవరూ చేరుకోని రీతిలో అగ్ర స్థానంలో ఉండాలని భావిస్తున్న డ్రాగన్ దేశం ఇప్పుడు 6జీ మీద కన్నేసింది. దీనికి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సమావేశం కావటమే కాదు.. ఆ దిశగా తాము చేపట్టాల్సిన చర్యల మీద చర్చలు జరిపింది.
6జీ నెట్ వర్క్ లో సరికొత్త వైర్ లెస్ టెక్నాలజీని ప్రోత్సహించటమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెబుతున్నారు. 6జీ తమకెంతో దూరంలో ఉందని.. కానీ దాన్ని దగ్గరకు చేసుకునేందుకు త్వరలోనే తాము 6జీ సేవల కోసం పరిశోధనల్ని షురూ చేయటం స్టార్ట్ అవుతుందన్నారు. సాంకేతికంగా ఏం చేయాలన్న అంశాలకు సంబంధించిన ప్లాన్ పూర్తి కాలేదని చెబుతున్నారు. ప్రపంచంలో 5జీ సేవలు పరిచయం కావటానికి చాలా దేశాల్లో మరికొన్ని ఏళ్లు పడుతుందని చెబుతున్న వేళ.. అందుకు భిన్నంగా అప్పుడు 6జీ సేవల మీద చైనా కన్నేయటం చూస్తే.. సాంకేతిక రంగంలో డ్రాగన్ దేశ ప్రాధాన్యం ఎంతలా ఉందన్న విషయం తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నయాని చెప్పక తప్పదు.