కొన్ని నిర్ణయాలు వెనువెంటనే దుష్పరిణామాల్ని చూపించకున్నా.. దీర్ఘకాలంలో దెబ్బ తీస్తుంది. చైనాలో ప్రస్తుతం అలాంటి పరిస్థితే నెలకొంది. గడిచిన కొన్నేళ్లుగా ఒక్కరంటే ఒక్కరిని మాత్రమే కనాలని.. ఇద్దరు పిల్లల్ని కనే విషయంలో నిషేధం ఉండటం తెలిసిందే. ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశంలో.. పిల్లల్ని కనే విషయంలో ప్రభుత్వం విధించిన ఆంక్షల ప్రభావం ఇప్పుడు చైనీయులకు పెద్ద తలనొప్పిగా మారింది. ప్రభుత్వానికి కూడా ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతోంది.
చైనాలోని కుర్రోళ్లకు అమ్మాయిలు దొరకటం లేదు. దీంతో.. పెళ్లి కాని ప్రసాదులు విపరీతంగా పెరిగిపోతున్నారు. అమ్మాయి దొరికితే చాలు.. అదే గొప్ప అన్నట్లుగా పరిస్తితి మారింది. ఇలాంటి పరిస్థితులతో కుర్రాళ్లు తెగ ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో చైనా ప్రభుత్వం కొత్త ఐడియా వేసింది. ఒక రైల్లో వెయ్యి మంది అబ్బాయిలు.. మరో వెయ్యి మంది అమ్మాయిలుకలిసి ప్రయాణం చేసేలా ప్లాన్ చేసింది.
ఈ రైల్లో ప్రయాణిస్తూ.. తమకు నచ్చిన అమ్మాయికి ప్రపోజ్ చేసి.. పెళ్లాడే అవకాశాన్ని కల్పిస్తారు. మనసులు నచ్చితే.. కలిసి ఉండే అవకాశం కూడా ఉంది. గడిచిన మూడేళ్లుగా ఇలాంటి లవ్ ఎక్స్ ప్రెస్ లను నిర్వహిస్తున్న చైనా ప్రభుత్వానికి పాజిటివ్ ఫలితం రావటంతో.. మరోసారి ఇదే తరహాలో లవ్ ఎక్స్ ప్రెస్ ను నడిపేందుకు సిద్ధపడుతోంది అక్కడి ప్రభుత్వం. గతంలో ఇలాంటి రైల్లో ప్రయాణించిన పలువురు పెళ్లిళ్లు చేసుకున్నారు. మొత్తం 10 కోజులు ఉండే ఈ లవ్ ఎక్స్ ప్రెస్ త్వరలో పట్టాలెక్కనుంది. మ్యాచ్ మేకింగ్ సర్వీస్ పేరుతో నిర్వహించే ఈ ట్రైన్ జర్నీ రానున్న రోజుల్లో మరెన్ని కొత్త జంటలకు ఆనందాన్ని ఇస్తుందో చూడాలి.