లోదుస్తులతో మాస్కులు..చైనా మోసంతో దెబ్బైపోయిన పాక్

Update: 2020-04-04 15:30 GMT
కరోనా కల్లోలం వేళ దాయాదీ దేశం పాకిస్థాన్ తన మిత్ర దేశం చైనా చేతిలో నిజంగానే దెబ్బైపోయిందని చెప్పాలి. కరోనా కలకలం వేళ... సాయమందిస్తానని చెప్పి... ఆ సాయంలోనే చైనా చేసిన మోసంతో పాక్ దెబ్బైపోయింది. తన భూభాగం నుంచే కరోనా వైరస్ ఇతర దేశాలకు విస్తరించినా... తాను మాత్రం కాస్తంత బయటపడిపోయిన చైనా.. తనదైన మార్కు మోసాన్ని తాను మిత్రదేశంగా పరిగణిస్తున్న పాక్ పై చూపడం ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తోంది. చైనా చేసిన మోసం... దానితో పాక్ దెబ్బైపోయిన తీరు ఎలాంటిదో చూద్దాం పదండి.

కోవిడ్-19 పుట్టిన చైనాలో కరోనా ప్రభావం ఇప్పుడు దాదాపు తగ్గిపోయింది. ప్రస్తుతం అక్కడి మార్కెట్లు అన్నీ ఓపెన్ అయ్యాయి. అంతే కాదు.. ఇతర దేశాలకు కావాల్సిన వైద్య పరికరాలు - ఇతర సామాగ్రిని చైనా ఎక్స్‌ పోర్ట్ కూడా చేస్తోంది. ఈ క్రమంలో మిత్రదేశమైన పాకిస్థాన్‌ ను కరోనా మహమ్మారి నుంచి రక్షించేందుకు ఆ దేశానికి కావాల్సిన వైద్య పరికరాలు - సామాగ్రిని అందించేందుకు చైనా అంగీకారం తెలిపిందట. గత వారం రోజులుగా పాకిస్థాన్‌ లో కరోనా పాజిటివ్ కేసులు పెద్ద ఎత్తున నమోదవుతున్నాయి. అ క్రమంలో వైద్యులకు కావాల్సిన మాస్క్‌ ల కొరత ఏర్పడింది. ఈ క్రమంలో పాకిస్థాన్‌ కు మంచి నాణ్యమైన N95 మాస్క్‌ లు అందజేస్తామని చైనా హామీ ఇచ్చిందట.

ఇచ్చిన మాట ప్రకారం చైనా పాకిస్థాన్‌కు N95 మాస్క్‌ లను పంపించింది. అయితే వాటిని ఓపెన్‌ చేసి చూస్తే షాక్‌ తిన్నారు అక్కడి అధికారులు. మాస్క్‌ ల పేరు చెప్పి చైనా మోసం చేసినట్లు పాకిస్థాన్‌ కు చెందిన ఓ మీడియా ప్రత్యేక కథనాన్ని రాసింది. “చైనా నే చునా లగా దియా” హెడింగ్ తో పాక్ కు చెందిన ఓ మీడియా ఆసక్తికర కథనాన్నిరాసిందట. నాణ్యమైన మాస్క్‌లు అందజేస్తామని చెప్పి.. అక్కడి వారు వాడిపడేసిన లోదుస్తులను, ఇన్నర్‌ వేర్‌ లతో తయారు చేసిన మాస్క్‌లను పాకిస్థాన్‌కు పంపిందంటూ పేర్కొంది. సింధ్ ప్రావిన్స్‌ లోని ప్రభుత్వాధికారులు ఈ మాస్క్‌లను చెక్ చేయకుండానే ఆస్పత్రులకు పంపించారని తెలిపింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Tags:    

Similar News