ఆన్‌లైన్ వ్యాపారం చేసేవారికి 90 శాతం డిస్కాంట్ ఇస్తే ఎలా ఉంటుంది? అది కూడా అన్నింటిపైనా ఇస్తే...అబ్బో సూపర్ అంటున్నారా? అంతగొప్ప ఆఫర్ చైనాలో ఇస్తున్నారు. తాజాగా చైనా ఆన్‌లైన్ వ్యాపారం హద్దులు చెరిగిపోతాయి. కొనుగోళ్లు కట్టలు తెంచుకుంటాయి. అలీబాబా, జేడీ డాట్ కామ్, టీమాల్ డాట్ కామ్ వంటి ఆన్ లైన్ కంపెనీలు ఇచ్చే ఆఫర్లకు కొనుగోలు శక్తి మెండుగా ఉన్న చైనా వినియోగదారుడు రెచ్చిపోతాడు...ఎందుకంటే ఈ రోజు 'చైనా సింగిల్స్ డే' (ఒంటరిగాళ్ల దినం)
వాలెంటైన్స్ డే, వసంతోత్సవం సందర్భాల్లో జరిగే వ్యాపారానికి మించి ఈ రోజు చైనాలో ఈ వినియోగదారీ ఉత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున వ్యాపారం జరుగుతుంది. ఒంటరి స్త్రీ, పురుషులు ఒకే రోజు రికార్డు స్థాయిలో అమ్మకాలు జరపడానికి ఆన్‌లైన్ వ్యాపార దిగ్గజాలు పోటీపడుతున్నాయి. ఒంటరిగా ఉండే యువతీ యువకులు తమ స్నేహితులకే కాకుండా తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు పెద్ద ఎత్తున కొనుగోళ్లు చేయడానికి ఈ రోజు ఆన్‌లైన్ షాపింగుకు ఎగబడతారు. వారిని ఆకర్షించడం కోసం దిగ్గజ వ్యాపార సంస్థలు ప్రపంచంలో ఎక్కడా లేనంతగా 25 నుండి 90 శాతం వరకు డిస్కౌంట్లతో అమ్మకాలు సాగిస్తాయి. చైనా అతి పెద్ద ఆన్‌లైన్ వ్యాపార సంస్థ అయిన అలీబాబా అన్ని రకాల వస్తువుల మీదా - ఆహారం, దుస్తులు, ఎలక్ట్రానిక్ వస్తువులు, గృహోపకరణాలు, సౌందర్య సాధనాలు ఒకటేమిటి అన్నిటి మీదా భారీ డిస్కౌంట్లు ఇస్తుంది. ఈ రోజు యువతీ యువకులు ఒకరిపై ఒకరు ప్రేమ ఎంత ఒలకబోస్తారో తెలీదుగానీ వినియోగ వస్తువులను మాత్రం ఇబ్బడి ముబ్బడిగా కొనిపడేస్తారు. వారికి ప్రేమ దొరుకుతుందో లేదో తెలియదుగానీ అలీబాబాకు అన్ని చోట్లా వినియోగదారులు అప్పనంగా దొరుకుతారు.
నవంబర్ 11తేదీ (11:11)ను చైనీయులు ఒంటరిగాళ్ల దినంగా పరిగణిస్తారు. చైనా యువకుల సెంటిమెంటును మార్కెట్ చేసుకోవడం కోసం ఈ రోజును వ్యాపార సంస్థలు బాగా ఉపయోగించుకుంటాయి. 11:11 అక్షరాలు చైనీయులు ఆహారం తీసుకునేందుకు ఉపయోగించే చోప్‌స్టిక్స్ మాదిరిగా ఉంటాయి. దీన్ని అలీబాబా కంపెనీ తన ట్రేడ్ మార్కుగా చేసుకుంది. అలీబాబా గ్రూపుకు చెందిన టి-మార్క్ కంపెనీ 2010 ఇదే రోజున 93.6 కోట్ల యువాన్ల ఆన్‌లైన్ వ్యాపారం చేయగా 2012లో ఇదే రోజు 11:11 ట్రేడ్ మార్క్‌తో 19,100 కోట్ల యువాన్ల వ్యాపారం చేసింది. 2013లో ఇదే రోజు 55 సెకెన్లలో 100 కోట్ల యువాన్ల వ్యాపారం చేసి రికార్డు సృష్టించింది. ఆ సంవత్సరం దాని మొత్తం టర్నోవర్ 35,019 కోట్ల యువాన్లకు చేరుకుని ప్రపంచాన్నే దిగ్బ్రాంతికి గురిచేసింది. 2014లో దాని అమ్మకాలు 57,100 యువాన్లకు పెరిగింది. ఈ ఏడాది చైనా ఆర్థికాభివృద్ధి వేగాన్ని తగ్గించడానికి చైనా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఈ రోజు వ్యాపారం రికార్డులు బద్దలు గొడుతుందని చెబుతున్నారు. చైనా వినియోగదారుల్లో 71 శాతం మంది మహిళలు కావడం విశేషం.
ఈ-కొనుగోళ్లలో అనాసక్తి ఉన్నా ఇంట్లో ఆడవాళ్ల ఆన్‌లైన్ వ్యాపారం దెబ్బకు ఠారెత్తిపోతున్నారు. దాంతో ఇటువంటి వినియోగదారీ దినాలు వచ్చినప్పుడు వాళ్లు ఆఫీసులకు సెలవు పెట్టి ఇంటో భార్యలు ఆన్‌లైన్ కొనుగోళ్లను పరిశీలిస్తూ ఉండిపోతున్నారు. ఎందుకంటే నవంబర్ 11వ తేదీ 0 గంటనుండే ఆఫర్లు ప్రారంభమవుతాయి. అప్పటినుండే ఆన్‌లైన్ ఆర్డర్లు పెట్టడం ప్రారంభమవుతుంది. కొందరైతే తమ బ్యాంక్ అకౌంట్ల పాస్‌వర్డ్స్ మార్చేస్తున్నారు. అయితే ఒంటరి గాళ్లకు ఆ బాధలేదు. అటువంటి టెన్షన్లు ఉండవు. అయినా టివీ యాడ్స్ ధాటికి వారూ తమ భాగస్వాములకు వినియోగ వస్తువులు కొనలేక విలవిల లాడిపోతున్నారు.